Three youths Died after Falling Into Godavari River: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. రావులపాలెం గౌతమి వంతెన వద్ద గోదావరి నదిలో స్నానానికి దిగి ముగ్గురు యువకులు మృతి చెందారు. ఈ ఘటనలో మరో యువకుడికి ఈత రావటంతో సురక్షితంగా బయటపడ్డాడు.
ప్రాణం తీసిన ఈత సరదా- ఊపిరాడక ఇద్దరు విద్యార్థులు మృతి - Children drowned in the pond
వివరాల్లోకి వెళ్తే: రావులపాలెంకు చెందిన ఐదుగురు యువకులు గోదావరిలో స్నానం చేసేందుకు వచ్చారు. ఒక యువకుడు గట్టుపై ఉండగా మిగిలిన నలుగురు గోదావరిలో దిగారు. సబ్బిళ్ల ఈశ్వర్ రెడ్డి, సత్తి సంపత్ రెడ్డి, పెంటా జయ కుమార్ గోదావరిలో గల్లంతవ్వగా, కొమ్మరి రాజేష్ అనే యువకుడు ఈత రావడంతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు మృతులు ఈశ్వర్ రెడ్డి, జయకుమార్ మృతదేహాలను వెలికితీశాయి. సంపత్ రెడ్డి మృతదేహం కోసం గోదావరిలో గాలిస్తున్నారు.
ఈతకు వెళ్లి కృష్ణా నదిలో ముగ్గురు విద్యార్థులు మృతి
ఈతకు వెళ్లిన స్నేహితులు మృతి: ఇటీవలే ఇలాంటి మరో ఘటన ప్రకాశం జిల్లా దోర్నాలలోని ఇంద్రానగర్‌లో చోటుచేసుకుంది. సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన చిన్నారులు విగత జీవులుగా మారారు. వివరాలిలా: ఇంద్రానగర్‌కు చెందిన అంజి(12), వలి(8) అనే ఇద్దరు స్నేహితులు దోర్నాల మండలం యడవల్లి శివారులోని క్వారీ గుంతకు సరదాగా ఈతకు వెళ్లారు. ఈ క్రమంలో ఇద్దరూ నీళ్లలో మునిగి మృతిచెందారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సాయంతో మృతదేహాలను క్వారీ నుంచి బయటకు తీశారు. ఇద్దరు చిన్నారులు విగతజీవులుగా కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
విషాదాన్ని నింపిన విహారయాత్రలు- ఈత కోసం దిగి ఐదుగురు విద్యార్థులు మృతి