Three Youth Drowned in Sriram Sagar Project : మహాశివరాత్రి పర్వదినాన నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శ్రీరాంసాగర్ జలాశయంలో ముగ్గురు యువకులు గల్లంతు అయ్యారు. ముప్కాల్ మండల పరిధిలోని లక్ష్మీ కాలువ హెడ్ రెగ్యూలేటరీ వద్ద స్నానానికి దిగిన యువకులు, ఒకరిని కాపాడబోయి ఒకరు నీట మునిగి పోయారు.
జక్రాన్పల్లి గణ్య తండా గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు మహాశివరాత్రి సందర్భంగా అద్దెకు వాహనం తీసుకొని పోచంపాడ్ ప్రాజెక్ట్ వద్దకు వెళ్లారు. అక్కడ శ్రీరాంసాగర్ జలాశయం లక్ష్మీ కాలువ హెడ్ రెగ్యులేటర్ వద్ద స్నానానికి దిగి గల్లంతయ్యారు. గల్లంతైన యువకులు లోకేశ్, సాయికిరణ్, మున్నాగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఆర్మూర్ ఏసీపీ బస్వారెడ్డి సహాయక చర్యల నిమిత్తం గజ ఈతగాళ్లను రంగంలోకి దింపారు.