ETV Bharat / state

గుంటూరు జిల్లాలో కొట్టుకుపోయిన కారు - ముగ్గురు దుర్మరణం - CAR WASHED OUT THREE PEOPLE DIED

Three People Died after Their Car Got Washed : గుంటూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కారు వాగులో కొట్టుకుపోయి ముగ్గురు మృతి చెందారు. స్థానికుల సాయంతో కారుతో పాటు వాగులో కొట్టుకుపోయిన మృతదేహాలను మున్సిపల్ అధికారులు బయటకు తీశారు. చిన్నారుల మృతదేహాలను చూసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Three people died after their car got washed
Three people died after their car got washed (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 31, 2024, 4:17 PM IST

Updated : Aug 31, 2024, 5:25 PM IST

Three People Died after Their Car Got Washed : గుంటూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెదకాకాని మండలం ఉప్పలపాడు సమీపంలోని వాగులో ఓ కారు కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. నంబూరులోని ఓ పాఠశాలలో ఉప్పలపాడుకు చెందిన రాఘవేంద్ర విధులు నిర్వహిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా శనివారం ఉదయం పాఠశాల యాజమాన్యం సెలవు ప్రకటించింది.

గుంటూరు జిల్లాలో విషాదం - వాగులో కారు కొట్టుకుపోయి ముగ్గురు మృతి (ETV Bharat)

దీంతో అదే పాఠశాలకు వెళ్లిన ఉప్పలపాడుకు చెందిన ఇద్దరు విద్యార్థులను తీసుకొని రాఘవేంద్ర స్వగ్రామానికి బయల్దేరాడు. మురుగు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నా ఆగకుండా వెళ్లడంతో వరద ఉద్ధృతికి కారు కొట్టుకుపోయింది. ఈ ఘటనలో రాఘవేంద్రతోపాటు కారులో ఉన్న విద్యార్థులు సాత్విక్‌, మానిక్‌లు మృతి చెందారు. స్థానికుల సాయంతో కారుతో పాటు వాగులో కొట్టుకుపోయిన మృతదేహాలను మున్సిపల్ అధికారులు బయటకు తీశారు. చిన్నారుల మృతదేహాలను చూసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Last Updated : Aug 31, 2024, 5:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.