Three People Dead in Road Accident at Pusalapadu: ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం పూసలపాడు గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం సోమవారం అర్ధరాత్రి దాటాక సంభవించింది. అనంతపురం - అమరావతి జాతీయ రహదారిపై (National Highway) టెంట్ హౌస్ సామాన్లతో వెళ్తున్న ఆటోను గుంటూరు నుంచి గిద్దలూరు వైపు వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో నుంచి మంటలు చెలరేగి ముగ్గురు సజీవ దహనమయ్యారు. కారులో ప్రయాణిస్తున్న మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని చికిత్స కోసం కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వారిని మార్కాపురం తీసుకెళ్లినట్లు తెలిపారు.
చనిపోయిన ముగ్గురిలో ఇద్దరు పూర్తిగా కాలిపోయినట్లు స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి గల కారణాలను సేకరిస్తున్నారు. మృతులు బేస్తవారిపేట మండలం బార్లకుంట గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, చిన్న వెంకటేశ్వర్లు, శ్రీరాములుగా పోలీసులు గుర్తించారు.
మద్యం మత్తులో ముందు వెళుతున్న లారీని ఢీ కొట్టి ఇద్దరు మృతి
Car Collided With Auto Three People Dead: పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామానికి చెందిన కొడుకు గురువయ్య, తండ్రి ఓబయ్య విజయవాడలో కొత్త కారును కొనుగోలు చేసి ఇంటికి వస్తున్నారు. ఈ క్రమంలో పూసలపాడు వద్ద కారు ఆటోని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు కూడా రైతులుగా పోలీసులు వెల్లడించారు. రైతులు గుంటూరుకు వెళ్లి మిర్చి పంట అమ్ముకొని తిరిగి స్వగ్రామమైన బార్లకుంటకు వస్తుండగా ఈ సంఘటన జరిగినట్లు పేర్కొన్నారు. ఆటో మార్కాపురం నుంచి కొమరోలుకు పెళ్లి డెకరేషన్ సామాన్లు దించి తిరిగి మార్కాపురం వెళుతుండగా పూసలపాడు వద్దకు వచ్చే సరికి రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆటో డ్రైవర్ షేక్ ఖాసింషా తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కూలీ పనికి వెళ్లి వస్తుండగా ప్రమాదం- ఆటోను ఢీకొన్న కారు, ముగ్గురు మృతి