ETV Bharat / state

గుంటూరు జిల్లాలో విషాదం- ఇసుక గుంతలకు ముగ్గురు బలి - ఇసుక గుంతలకు ముగ్గురు బలి

Three Boys Drown in Krishna River in Guntur District: ఇసుక అక్రమ తవ్వకాలతో ఏర్పడిన గుంతల్లో చిక్కుకుని ముగ్గురు బాలురు మృత్యువాతపడ్డారు. ఈ విషాద ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది.

Three_Boys_Drown_in_Krishna_River
Three_Boys_Drown_in_Krishna_River
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 29, 2024, 10:19 AM IST

Three Boys Drown in Krishna River in Guntur District: కృష్ణానదిలో ఇసుక గుంతలు ముగ్గురు బాలుర జీవితాలను బలితీసుకున్నాయి. సరదాగా గడిపేందుకు నదిలోకి వెళ్లిన ముగ్గురు విద్యార్థులు నీటిలో మునిగి మృతిచెందిన విషాద ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. సకాలంలో పోలీసులు, అంబులెన్సు రాకపోవడంతో మృతదేహాలను ద్విచక్రవాహనాలపైనే కుటుంబ సభ్యులు ఒడ్డుకు చేర్చారు.

ఆదివారం సెలవు రోజు మూడు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. విజయవాడలోని పటమటకు చెందిన గగన్‌, తన స్నేహితులు ప్రశాంత్‌, కార్తీక్‌, షేక్‌ షారుఖ్‌లతో కలిసి సరదాగా గడిపేందుకు యనమలకుదురు సమీపంలోని కృష్ణా నదికి వెళ్లారు. అక్కడ ఒడ్డున కొద్దిసేపు ఫొటోలు దిగారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రశాంత్‌, కార్తీక్‌, గగన్‌ నీటిలోకి దిగారు. సరిగా అక్కడే గుంత ఉండడంతో ఒక్కసారిగా అందులోకి కూరుకుపోయారు.

Three People Dead in Krishna River: ఈత రాకపోవడంతో సహాయం చేయాలని కేకలు వేయగా, ఒడ్డున ఉన్న షారూఖ్‌ వారిని కాపాడేందుకు ప్రయత్నించాడు. సాధ్యం కాకపోవడంతో సమీపంలో ఉన్న జాలర్లకు విషయం చెప్పాడు. వారు అక్కడికి చేరుకుని ముగ్గురినీ కర్రలతో లాగేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. చివరికి వల వేసి వెలికి తీసినా.. అప్పటికే వారు మరణించారు. విగతజీవులుగా మారిన బిడ్డలను చూసి కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

చేపల వేటకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి

ఈ దుర్ఘటన గురించి తాడేపల్లి పోలీసులకు ఆదివారం సాయంత్రం సమాచారం అందించగా వారు రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఘటనా స్థలానికి చేరుకుని సమాచారాన్ని పెనమలూరు పోలీసులకు చేరవేశారు. మృతదేహాలను తరలించేందుకు అంబులెన్సులు సమకూర్చాలని కోరినా అరగంట వరకు రాలేదు. దీంతో సాయంత్రం నుంచి మృతదేహాలతోనే ఉన్నామని, పోస్టుమార్టం కోసం తరలించేందుకు ఇంత ఆలస్యం ఎందుకు చేస్తున్నారని మృతుల బంధువులు పోలీసులను నిలదీశారు.

చివరికి మూడు ద్విచక్రవాహనాలపై మృతదేహాలను తీసుకుని కొత్త ప్రభుత్వాసుపత్రికి బయలుదేరారు. యనమలకుదురు శివాలయం సమీపంలోకి రాగానే పోలీసులు వారిని ఆపి అంబులెన్సులు వస్తున్నాయని తెలిపారు. 45 నిమిషాలు ఎదురుచూసినా రాకపోవడంతో బంధువులు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు.

Three Students Died in Krishna River: మృతదేహాలను తమ ఇళ్లకు తీసుకెళ్తామని కదులుతుండగా.. అంబులెన్సులు రావడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇసుక అక్రమ తవ్వకాలతో ఏర్పడిన గుంతల కారణంగానే విద్యార్థులు నీట మునిగి మృత్యువాతపడ్డారని స్థానికులు ఆరోపించారు. ఏడాది క్రితం ఇదే ప్రాంతంలో ఈత కోసం నీటిలోకి దిగిన విజయవాడకు చెందిన ఐదుగురు చనిపోయారని గుర్తు చేశారు.

కాలువలో మునిగి ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.