ETV Bharat / state

వేసవి సెలవులకు అమ్మమ్మ ఇంటికి వెళ్లి - ప్రేమికుడితో కలిసి మాస్టర్​ ప్లాన్​ - ఏదో చేద్దామనుకుంటే! - Lovers Robbed Relative House Case - LOVERS ROBBED RELATIVE HOUSE CASE

Thief Robbed Singareni Worker House in Mancherial : వేసవి సెలవులను గడిపేందుకు అమ్మమ్మ ఇంటికి వెళ్లిన ఓ యువతి ఆ ఇంట్లో నగదుపై కన్నేసింది. తన ప్రియుడితో కలిసి సినీఫక్కీలో పథకం వేసి ఆ నగదును కొట్టేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు చాకచక్యంగా నిందితులను పట్టుకున్నారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది.

Lovers Robbed Relative House Case
Thief Robbed Singareni Worker House (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 1, 2024, 1:58 PM IST

Updated : Jun 1, 2024, 2:07 PM IST

Thief Robbed Singareni Worker House in Mancherial : సాధారణంగా ఎవరైనా వేసవి సెలవులకు అమ్మమ్మ లేదా బంధువుల ఇంటికి వెళ్తే సరదాగా గడిపేసి వస్తారు. అక్కడ ఉన్న అన్ని రోజులను మంచి జ్ఞాపకాలుగా మార్చుకుంటారు. అయితే ఓ యువతి దీనికి భిన్నంగా ప్రవర్తించింది. తాను కూడా ఓ జ్ఞాపకంగా మార్చుకుంది. కాకపోతే అది వేరే లెవల్​. అమ్మమ్మ ఇంటికి వెళ్లిన ఆ యువతి వాళ్ల ఇంట్లో నగదుపై ఆశ పడి చోరీ చేసింది. చివరికి పోలీసులకు చిక్కింది. ఈ దొంగతనంలో తన ప్రియుడు సాయం చేశాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది.

మంచిర్యాల గ్రామీణ సీఐ అశోక్​ తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్​కు చెందిన యువతి(19) బోయిన్​పల్లికి చెందిన యువకుడు(22)తో ఆన్​లైన్​లో ఏడాది క్రితం పరిచయం ఏర్పడింది. ఇది కాస్త ప్రేమగా మారి పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలో వేసవి సెలవులు కావడంతో యువతి మంచిర్యాల జిల్లా నస్పూర్‌లోని నాగార్జున కాలనీలో ఉండే అమ్మమ్మ ఇంటికొచ్చింది. తాత గుమ్మడి సత్తయ్య సింగరేణి కార్మికుడు. స్థలం కొనుగోలు కోసమని రూ.4.50 లక్షల నగదును క్వార్టర్‌లో దాచుకున్నాడు. దీనిపై ఆ యువతి కన్నేసింది. ఈ విషయాన్ని చరవాణిలో యువకుడికి సమాచారం ఇవ్వడంతో హైదారాబాద్‌ నుంచి నస్పూర్‌లోని నాగార్జున కాలనీకి చేరుకున్నాడు. మే 27న గుమ్మడి సత్తయ్య విధులకు వెళ్లాడు. సాయంత్రం సమయంలో అమ్మమ్మ వాకింగ్​ చేసేందుకు బయటకు వెళ్లింది.

మేడ్చల్‌ జిల్లాలో భారీ చోరీ - ఫంక్షన్​కు వెళ్లొచ్చేలోపు దోచేశారు

Thief Robbed Singareni Worker House : ఇంటిలో ఎవరు లేరని తెలుసుకున్న యువతి తన పథకాన్ని ప్రవేశపెట్టింది. పక్కా ప్రణాళిక ప్రకారం తన ప్రియుడికి ఫోన్​ చేసి సమాచారం తెలిపింది. వెంటనే యువకుడు క్వార్టర్‌ వెనుక గోడ దూకి రాగా ఇద్దరు కలిసి బీరువా పగులగొట్టారు. అనంతరం యువతి క్వార్టర్‌ వెనుక తలుపులు దగ్గరికి వేసి ఇంటి ముందు తాళం వేసి బయటకు వచ్చింది. ఈలోపు వాకింగ్​కు వెళ్లిన అమ్మమ్మ వచ్చి ఇంటిలో చూడగా దొంగతనం జరిగినట్లు గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం అందించింది. సీఐతో పాటు నస్పూర్‌ ఎస్సై రవికుమార్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Singareni Worker House Robber Case : పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో ఇద్దరి ప్రేమికులను పట్టుకుని వారి నుంచి 15 తులాల బంగారం, 30 తులాల వెండి, రూ.4.25 లక్షలు నగదు, ద్విచక్రవాహనం, రెండు చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. వారిని రిమాండ్‌ తరలించామని సీఐ పేర్కొన్నారు. చాకచక్యంగా దొంగతనం కేసును ఛేదించిన పోలీసులను రామగుండం పోలీసు కమిషనర్‌ శ్రీనివాస్, మంచిర్యాల డీసీపీ అశోక్‌ కుమార్‌లు అభినందించారు.

తాళం వేసిన ఇళ్లే ఆదొంగల టార్గెట్ - నగరంలో బెంబేలెత్తిస్తున్న వరుస చోరీలు - Massive theft in Shameerpet

Last Updated : Jun 1, 2024, 2:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.