ETV Bharat / state

ఆ ఊళ్లో 70 ఏళ్లుగా దీపావళి జరుపుకోరు - ఎందుకో తెలుసా?

70 ఏళ్లుగా దీపావళి పండుగ చేసుకోని కిత్తంపేట గ్రామం- ఇదే ఆచారంగా వస్తోందన్న గామస్థులు

DONOT CELEBRATE DIWALI
KITHAMPET VILLAGE (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 30, 2024, 12:27 PM IST

The Village do not Celebrate Diwali : దేశవ్యాప్తంగా ప్రజలంతా సంతోషంతో చేసుకునే ముఖ్య పండుగ దీపావళి. ఈ పండుగ రోజున బంధుమిత్రులకు మిఠాయిలు పంచి, శుభాకాంక్షలు చెబుతాం. రకరకాల పిండి వంటలు చేసుకోవడం, నూతన వస్త్రాలు ధరించడం, సాయంత్రం దీపాలు వెలిగించడం, టపాసులు కాల్చడం చేస్తాం. పిల్లలు, పెద్దలంతా బాణాసంచా కాలుస్తూ సందడి చేస్తారు. అయితే ఆంధ్రప్రదేశ్​లోని అనకాపల్లి జిల్లాలో ఉన్న ఓ కిత్తంపేట అనే గ్రామం దాదాపుగా 70 ఏళ్లుగా దీపావళికి దూరంగా ఉంటోంది. ఎందుకని ఆరా తీస్తే గ్రామస్థులు ఇలా చెప్పారు.

కిత్తంపేట గ్రామం రావికమతం మండలం, జడ్‌.బెన్నవరం పంచాయతీలో ఉంది. 450 ఇళ్లు, 1500 జనాభా ఉంటారు. శివారు గ్రామమైనా జనాభా పరంగా జడ్‌.బెన్నవరం కంటే పెద్దది. రాజకీయంగా చైతన్యవంతం కావడంతో ఈ ఊరి వారే సర్పంచులుగా ఎన్నికవుతూ వస్తున్నారు. ఈ ఊరి వారంతా దీపావళి పండుగకు దూరంగా ఉండటం ఆచారంగా వస్తోందని గ్రామస్థులు చెబుతున్నారు. తమ చిన్నతనం నుంచి ఇప్పటివరకు ఎన్నడూ టపాసులు కాల్చలేదని స్థానికులు జాజిమొగ్గల మాణిక్యం, ముచ్చకర్ల నూకునాయుడు, జంపా ఈశ్వరరావు పేర్కొన్నారు.

టపాసుల వల్లే : గతంలో అందరిలాగే మా ఊర్లోనూ దీపావళి పండుగను ఘనంగా జరుపుకొనే వారు. 70 ఏళ్ల కిందట ఊరంతా పాకలే ఉండేవి. గడ్డివాములు, ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు ఇంటి ఆవరణలోనే ఉండేవి. దీపావళి రోజున దివిటీలు తిప్పుతుండగా నిప్పురవ్వలు పడి ఇళ్లన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. మూగజీవాలన్నీ మృత్యువాతపడ్డాయి. అప్పట్నుంచి అన్నీ అపశకునాలే జరుగుతున్నాయి. ఎన్నడూ లేనివిధంగా దీపావళి సమయంలోనే మరణాలు ఎక్కువగా సంభవించేవి. కీడు జరుగుతోందని నాటి పెద్దలు దీపావళికి దీపాలు వెలిగించడం మానేశారు. ఎవరూ పండుగ చేసుకోవద్దని నిర్ణయించారు. అదే ఆనవాయితీగా వస్తోంది. నాగుల చవితి రోజున పుట్టలో పాలు పోసి, టపాసులు కాలుస్తామని మాజీ సర్పంచ్​ కర్రి అర్జున పేర్కొన్నారు.

పండగొస్తే ఊరెళ్లే వాళ్లం : 'మా వయసు 65. మేం పుట్టక ముందు, ఊహ తెలిసిన దగ్గర్నుంచి గ్రామంలో దీపావళి జరుపుకోవట్లేదు. అప్పటి రోజుల్లో పండుగ రోజున విషాద ఘటనలు జరిగేవని, పండుగ కలిసిరావడం లేదని టపాసులు కాల్చడం మానేశారని చెప్పేవారు. పండక్కు అమ్మమ్మ, తాతయ్య ఊరెళ్లే వాళ్లం'.

KITHAMPET VILLAGE
జంపా కల్యాణం, సాలాపు కృష్ణ (ETV Bharat)

ఈ ఊరికి కోడళ్లుగా వచ్చాం : 'మా అమ్మగారిది టి.అర్జాపురం. 40 ఏళ్ల కిందట కిత్తంపేటకు కోడళ్లుగా వచ్చాం. మా చిన్నప్పుడు అమ్మగారి ఊర్లో ఏటా దీపావళిని జరుపుకొనే వాళ్లం. ఈ ఊర్లో దీపావళి జరుపుకోరని ఇక్కడకు వచ్చాకే తెలిసింది. అప్పట్లో పిల్లలను తీసుకుని పండక్కి పుట్టింటికి వెళ్లి అక్కడ టపాసులు కాల్పించే వాళ్లం.'

DONOT CELEBRATE DIWALI
చెన్నంశెట్టి దేముడమ్మ, ముచ్చకర్ల నాగరాజు (ETV Bharat)

దీపావళి శుభాకాంక్షలు వెరీ స్పెషల్​గా చెప్పండిలా - మీ ఆత్మీయుల ముఖం తారాజువ్వలా వెలిగిపోతుంది!

టపాసులు కాల్చేటప్పుడు కచ్చితంగా ఇవి పాటించండి - అప్పుడే 'హ్యాపీ దీపావళి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.