Suicide in Mahabubabad District : మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడికి బైక్ అంటే చాలా ఇష్టం. ఎలాగైనా సొంత వాహనం కొనుక్కోవాలనే కోరిక. కానీ ఆర్థిక పరిస్థితి వల్ల ఇక్కట్లు తప్పలేదు. ఆ యువకుడి తండ్రి వ్యవసాయం చేస్తూ, కుటుంబాన్ని పోషిస్తూ సంసారాన్ని నెట్టుకొస్తున్నాడు. అవన్నీ తెలియని ఈ కాలం పిల్లలకు ఏదైనా కావాలంటే వెంటనే ఇవ్వా.లి లేదంటే వారి కోపానికి, చర్యలకు తల్లిదండ్రులకు పుత్రశోకం తప్పడం లేదు. అలాంటి ఓ ఘటనే మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. బైక్ కొనివ్వలేదనే మనస్తాపంతో ఓ యువకుడు మృతి చెందాడు.
తండ్రి ద్విచక్ర వాహనం కొనివ్వలేదని మనస్తాపానికి గురై కాడబోయిన కుమార్ (24) అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. కుమార్ ఇంటర్మీడియట్ మధ్యలోనే మానేసి, ఇంటి వద్దే ఉంటున్నాడు. గత కొన్ని రోజులుగా తన తండ్రి శ్రీనుతో తనకు ద్విచక్ర వాహనాన్ని కొనివ్వమని పదే పదే అడిగాడు. ఈ సారి పంట చేతికి వచ్చిన తరువాత కొనిస్తానని, కొంతకాలం ఆగమని తండ్రి సర్ది చెప్పాడు.
ప్రాణం తీసిన పురుగుల మందు : దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కుమార్, పురుగుల మందు తాగాడు. అనంతరం తన సోదరుడికి ఫోన్ చేసి పురుగుల మందు తాగానని చెప్పాడు. వెంటనే కుమార్ సోదరుడు అప్రమత్తమై అతన్ని మహబూబాబాద్ జిల్లాలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా కుమార్ ప్రాణాలు వదిలాడు.
తల్లిదండ్రుల ఆశలను అడియాశలు చేసి తనువు చాలించడంతో తల్లిదండ్రులు, బంధుమిత్రులు గుండెలవిసేలా రోదించడం స్థానికులను కలచివేసింది. వారి ఆర్తనాదాలు చుట్టుముట్టు వారందరినీ కంటతడి పెట్టించాయి. విషయం తెలుసుకున్న మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ ఆసుపత్రికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చి ధైర్యం చెప్పారు.
గంజాయి ఆరోపణలతో కానిస్టేబుల్ మనస్తాపం - సెల్ఫీ వీడియో తీసి మరీ!
వివాహమైన నెల నుంచే వేధింపులు - సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సూసైడ్