ETV Bharat / state

'నాకు చావు తప్పదని తెలుసు - డాక్టర్‌ నీతో చెబుతుంటే విన్నాను - సారీ బావా' - MOTHER COMMITS SUICIDE WITH SON

కుమారుడితో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం - కుమారుడి మృతి - తల్లిని కాపాడిన భర్త, స్థానికులు

Mother Commits Suicide With Son In Suryapet
Mother Commits Suicide With Son In Suryapet (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 6, 2024, 10:34 AM IST

Updated : Dec 6, 2024, 11:08 AM IST

Mother Commits Suicide With Son In Suryapet : 'బావా నన్ను క్షమించు. నాకు చావు తప్పదని తెలుసు. నీతో డాక్టర్‌ చెబుతుంటే విన్నాను. చావు నాకోసం ఎదురు చూడకుండా నేనే దాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నాను. గతంలో కూడా చావడానికి వెళ్లాను కానీ నీకు దొరికిపోయాను. ఈసారి మాత్రం చావడానికే వెళ్తున్నాను. సారీ బావా' అంటూ లెటర్‌ రాసి 11 నెలల కుమారుడితో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటనలో కుమారుడు చనిపోగా, తల్లిని స్థానికులు రక్షించారు.

ఈ ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ మండలం లక్కవరంలో చోటుచేసుకుంది. భర్త రణపంగు నవీన్‌ తెలిపిన వివరాల ప్రకారం, గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామానికి చెందిన మమతకు, హుజూర్‌నగర్‌ మండలం లక్కవరం గ్రామానికి చెందిన రణపంగు నవీన్‌తో 2018లో పెళ్లి జరిగింది. వీరికి సాన్వి(6) పాప, అయాన్‌ (11 నెలల) బాబు ఉన్నారు.

మానసిక ఇబ్బందులతో : మమతకు నాలుగు నెలల క్రితం వైరల్‌ జ్వరం తీవ్రంగా రావడంతో హైదరాబాద్‌లో చికిత్స చేయించారు. తర్వాత బాగానే ఉన్నప్పటికీ నెల రోజుల క్రితం ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. అనంతరం భర్త నవీన్‌కు ఫోన్‌ చేసి 'నేను ఇంటి నుంచి వెళ్లిపోతున్నాను, నా కోసం ఎవరూ వెతకకూడదు' అని చెప్పింది. ఆ సమయంలో నవీన్‌ ఆమె పుట్టింటి వారితో కలిసి ఆచూకీ తెలుసుకుని ఇంటికి తీసుకొచ్చి, పెద్ద మనుషులతో చర్చలు జరిగి తిరిగి కాపురానికి తీసుకుని వచ్చారు. అయితే ఆమెకు చికిత్స అనంతరం నుంచి మానసికంగా కొంత ఇబ్బంది పడుతున్నట్లు కుటుంబ సభ్యులు చెప్పారు.

ప్రేమన్నాడు - పెళ్లి మాట ఎత్తేసరికి కులం అడ్డొస్తుందన్నాడు : మనస్తాపంతో యువతి మృతి

బుధవారం రాత్రి వర్షం పడుతుండటంతో నవీన్‌ మమతకు ఫోన్‌ చేసి వర్షం పడుతుంది, తనకు ఆలస్యం అవుతుందని చెప్పారు. వర్షం తగ్గాక ఇంటికి వెళ్లేసరికి ఇంట్లో మమత లేదని, పాప లక్కీ నిద్రపోతున్నట్లు గమనించి పరిసరాల్లో గాలించారు. అనంతరం ఆమెకు ఫోన్‌ చేయగా, ఫోన్‌ ఇంట్లోనే ఉన్నట్లు గుర్తించారు. టీవీ వద్ద సూసైడ్‌ నోట్‌ ఉండటాన్ని గమనించి, చుట్టుపక్కల వారితో కలిసి ఆమెను వెతకడం ప్రారంభించారు.

ఇంటి దగ్గరలోని వ్యవసాయ బావుల్లో చూసేందుకు వెళ్లగా ఓ బావిలో పెద్ద శబ్దం వచ్చింది. దీంతో నవీన్, అతడితో ఉన్నవారు గమనించి ఆమెను బావిలో నుంచి తీసి కాపాడారు. కుమారుడు అయాన్‌ గురించి ఆమెను ప్రశ్నించగా, పలు రకాలుగా సమాధానాలు చెబుతుండటంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు వచ్చి ఆమెను ప్రశ్నించగా బావిలోనే పడేసినట్లు చెప్పడంతో అందులోనే వెతికారు. దొరక్కపోవడంతో తిరిగి గురువారం గాలింపు చేపట్టి అయాన్‌ మృతదేహాన్ని వెలికి తీశారు. భర్త నవీన్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మన ప్రేమ విషయం మీ పై ఆఫీసర్లకు చెబుతా : యువతి బెదిరింపులతో ఎస్సై సూసైడ్!

అత్త-కోడలు మధ్య వివాదం - ఉరేసుకుని వివాహిత బలవన్మరణం - అత్తింటిపై తల్లిదండ్రుల దాడి

Last Updated : Dec 6, 2024, 11:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.