ETV Bharat / state

రెడీ టు రేస్ - బైక్ దొంగలను పట్టించిన క్యాచీ కొటేషన్ - QUOTATION CAUGHT THIEVES IN HYD

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 31, 2024, 2:32 PM IST

Quotation Caught The Thieves : కుమారుడి కోరికపై అప్పుచేసి మరీ ఓ మంచి బైక్​ను కొనిచ్చాడు ఆ తండ్రి. అయితే విలాసాలకు అలవాటు పడిన కొడుకు మాత్రం అదే బైక్​పై తిరుగుతూ సెల్​ఫోన్​ చోరీలకు పాల్పడుతున్నాడు. బైక్ నంబర్​ ఎవరికీ కనిపించకుండా జాగ్రత్తపడుతూ చోరీలు సాగిస్తున్నాడు. కానీ అతడు ఎంతో ఇష్టపడిన బైక్ ​వెనుక రాయించుకున్న కొటేషనే అతడిని పట్టించింది. ఇంతకీ ఏం జరిగిందంటే?

Quotation Caught The Thieves
Quotation Caught The Thieves (ETV Bharat)

Quotation Caught The Thieves : అడగ్గానే అప్పు చేసి మరీ కేటీఎం బైక్​ను కొనిచ్చాడు ఆ తండ్రి. విలాసాలకు అలవాటుపడిన ఆ యువకుడు దానిపై తిరుగుతూ సెల్‌ఫోన్‌ చోరీలకు పాల్పడుతున్నాడు. తన బైక్‌ నంబర్‌ ఎవరికీ కనిపించకుండా జాగ్రత్తలు పడ్డాడు. కానీ బైక్‌ వెనక అతడు ఎంతో ఇష్టపడి రాసుకున్న ‘కొటేషన్‌’ అతన్ని పోలీసులకు పట్టించింది.

Quotation Caught The Thieves
నిందితుల బైక్​వెనుక రాసిన కొటేషన్ (EENADU)

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జూబ్లీహిల్స్‌ రోడ్డునంబర్‌-25కు చెందిన రామకృష్ణ ఈ నెల 24న ఆసుపత్రికి వెళ్లిన తన భార్య కోసం జూబ్లీహిల్స్‌లో ఎదురుచూస్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు అతని చేతిలోని సెల్​ఫోన్​ లాక్కొని పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన జూబ్లీహిల్స్‌ పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు. నిందితులు కేటీఎం బైక్‌పై వచ్చినట్లు గుర్తించారు. అయితే బైక్ నంబర్ చూసి దొంగను కనిపెడదామనుకున్న పోలీసులకు షాక్ తగిలింది. నంబర్ ప్లేట్ కనబడకుండా దొంగలు జాగ్రత్తపడ్డారు.

అయితే నంబర్‌ ప్లేట్‌ కనిపించకుండా జాగ్రత్త పడినా పోలీసులు కేటీఎం షోరూం ద్వారా ఎలాగోలా వివరాలను సేకరించారు. ఈ క్రమంలోనే అనుమానిత వాహనాల జాబితా సిద్ధం చేసి సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆగంతుకులు తమ వాహనంపై రాసుకున్న ‘'రెడీ టు రేస్‌'’ పేరుతో ఉన్న కొటేషన్‌ను పోలీసులు గుర్తించారు. ఆ కొటేషన్ సాయంతో చోరీ చేసింది బేగంపేటలో నివసిస్తూ ఇంటర్‌ చదువే కిరణ్‌ కుమార్‌(19)తోపాటు మరో మైనరు అని గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో వారిని విచారించగా చోరీ చేసినట్లు వారు పోలీసుల ఎదుట అంగీకరించారు.

పోలీసుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు : కిరణ్​కుమార్​ తండ్రి కుటుంబ పోషణ కోసం సైకిల్​పై టిఫిన్ అమ్ముతూ కొడుకు అడిగాడని అప్పుచేసి మరీ కేటీఎం బైక్​, ఐఫోన్​ కొనిచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. కిరణ్​తో పాటు అతడి ఫ్రెండ్​ మద్యానికి, విలాసాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ దొంగ స్టైలే వేరు : ఇలాంటి ఘటనే కొద్ది రోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. ఓ వ్యక్తి చోరీ చేసే సమయంలో డబ్బులను, నగలను కాకుండా కేవలం మొబైల్స్​ను మాత్రమే దొంగిలిస్తున్నాడు. ఆ ప్రాంతవాసులను కంటిమీద కునుకు లేకుండా చేసిన దొంగను పోలీసులు కొద్దిరోజుల క్రితమే అరెస్టు చేశారు.

అయ్యయ్యో ఎంత పనైంది దేవుడా!! - తీర్థయాత్రలకు వెళ్లొచ్చే సరికి ఇంట్లో చోరీ - THEFT AT A HOUSE IN SECUNDERABAD

'ఈ దొంగ స్టైలే వేరప్పా - డబ్బు ముట్టడు - బంగారం తాకడు - మొబైల్ ఫోన్లు మాత్రం వదలడు' - Mobile thief In Yellandu

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.