Pan Shop Case Issue in Hyderabad : సమయపాలన పాటించడం లేదంటూ ఓ పాన్‌షాప్ నిర్వాహకుడిని గస్తీ పోలీసులు లాఠీలతో చితకబాదిన ఘటన హైదరాబాద్‌లోని బోరబండ ప్రాంతంలో చోటు చేసుకుంది. దీంతో పాన్‌షాప్ నిర్వాహకుడు మెహ్రాజ్ కాలుకు లాఠీల దెబ్బల వల్ల తీవ్ర గాయం అయింది. వెంటనే అతడిని అమీర్‌పేట్‌లోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం, రాత్రి పాన్‌షాప్ మూసి వేసే క్రమంలో కస్టమర్లు ఎక్కువ సంఖ్యలో రావడంతో కాస్త ఆలస్యమైందని తెలిపాడు. అందుకు తనపై చట్ట ప్రకారం పెట్టి కేసు వేయాలని కోరినట్లు చెప్పాడు. అయినాసరే పోలీసులు తన మాట వినకుండా విచక్షణారహితంగా లాఠీలతో తనపై దాడి చేసినట్లు వెల్లడించాడు. దాంతో తన కాలుకు తీవ్ర గాయం అయిందని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటునట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
పాన్‌షాప్ నిర్వాహకుడిని చితకబాదిన పోలీసులు - వీడియో వైరల్!
రాత్రి వేళలు దాటిన పాన్‌షాప్ మూయని నిర్వాహకుడు - గస్తీ నిర్వహించిన పోలీసులు - షాపు కట్టకపోవడంతో లాఠీతో కొట్టిన పోలీసులు - తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చేరిన పాన్‌షాపు నిర్వాహకుడు
Published : Nov 13, 2024, 1:14 PM IST