ETV Bharat / state

తెలంగాణలో మయోనైజ్​ తినలేరు - బ్యాన్ చేసిన వైద్య ఆరోగ్య శాఖ - MAYONNAISE BAN IN TELANGANA

ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఘటనల నేపథ్యంలో మయోనైజ్​పై నిషేధం - కీలక నిర్ణయం తీసుకున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి

Mayonnaise Ban In Telangana
Mayonnaise Ban In Telangana (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 30, 2024, 7:35 PM IST

Updated : Oct 30, 2024, 7:56 PM IST

Mayonnaise Ban In Telangana : తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఫుడ్​ లవర్స్​ ఎంతో ఇష్టంగా తినే మయోనైజ్‌పై నిషేధం విధించాలని ఈ మేరకు నిర్ణయించింది. ఫుడ్ సేఫ్టీ అధికారులతో సమీక్షనిర్వహించిన అనంతరం వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ మేరకు ఫుడ్‌ సేఫ్టీ కమిషనర్‌ ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేయనున్నారు. రాష్ట్రంలో పలు హోటళ్లు, ఫుడ్‌స్టాళ్లలో తరచూ ఎంక్వైరీలను చేయాలని సంబంధిత అధికారులకు ఈ సందర్భంగా మంత్రి కీలక సూచనలు చేశారు.

రాష్ట్రంలో మూడు టెస్టింగ్ ల్యాబ్​లు : రాష్ట్రంలో నూతనంగా 3 ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లు, 5 మొబైల్‌ ఫుడ్‌ సేఫ్టీ ల్యాబ్స్‌ ఏర్పాటు చేయాలని దామోదర రాజనర్సింహా ఆదేశించారు. కల్తీ ఆహారపదార్థాల్ని తీసుకొని పలువురు తీవ్ర అనారోగ్యం పాలవుతోన్న ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

సాధారణంగా ఈ మయోనైజ్‌ను ఎక్కువగా మండి బిర్యానీ, కబాబ్‌లు, పిజ్జాలు, బర్గర్లు, శాండ్‌విచ్‌లు, ఇతరత్రా ఆహార పదార్థాల్లో చెట్నీలా వేసుకుని తింటారు. ఇటీవల జరిగిన ఘటనలతో బల్దియా ఆహార కల్తీ నియంత్రణ విభాగం అప్రమత్తమైంది. ఎన్నిసార్లు చెప్పినప్పటికీ హోటళ్లు తీరు మారట్లేదంటూ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ మేరకు ఆ పదార్థాన్ని నిషేధించేందుకు అనుమతి కోరింది.

వరుస ఘటనల నేపథ్యంలో : హైదరాబాద్​లోని బంజారాహిల్స్‌ నందినగర్, సింగాడకుంట బస్తీ, గౌరిశంకర్‌కాలనీలలో గత శుక్రవారం సంత జరిగింది. అక్కడ ఏర్పాటు చేసిన ‘దిల్లీ హాట్‌ మోమోస్‌’ దుకాణంలో విక్రయించిన నాన్​వెజ్​ మోమోస్, వాటితో పాటు ఇచ్చిన మయోనైజ్, చట్నీని బస్తీకి చెందిన రేష్మబేగం అనే మహిళ, ఆమె పిల్లలు రుమ్షా, రఫియాలు తిన్నారు. అదేరోజు రాత్రి ముగ్గురికీ విరోచనాలు, వాంతులు అయ్యాయి. పిల్లలిద్దరినీ హాస్పిటల్​లో చేర్చగా తల్లి ఇంట్లోనే ఉంది. ఆదివారం రేష్మబేగం (31) ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నిమ్స్ హాస్పిటల్​కు తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మరణించింది. ఈ కేసులో పోలీసులు ఇవాళ మోమోస్ విక్రయించిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.

నాసిరకం మయోనైజ్​ తిని హాస్పిటల్​ పాలై : ఇటీవలే అల్వాల్‌లోని గ్రిల్‌ హౌజ్‌ హోటల్‌లో నాసిరకమైన మయోనైజ్‌ను తిన్న కొందరు యువకులు ఇటీవల హాస్పిటల్​ పాలయ్యారు. వారం కిందట ఐదుగురు వాంతులు, విరేచనాలతో స్థానిక హాస్పిటల్​లో చేరడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది జనవరి 10న కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. అదే హోటల్‌లో షవర్మను తిన్న 20 మందికిపైగా యువకులు 3, 4 రోజులయ్యాక అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. కొంతమందికి బ్లడ్​ టెస్ట్​లు చేయగా హానికర సాల్మనెల్లా బాక్టీరియా ఉన్నట్లు వైద్యులు తేల్చారు. ఆ హోటల్‌లోని షవర్మ బాగోలేదని బల్దియాకు కంప్లైంట్​లు అందాయి.

ఇటీవల తనిఖీల్లో నాణ్యతలేని మయోనైజ్​ గుర్తింపు : ఇవి మాత్రమే కాదు సికింద్రాబాద్​ ఈస్ట్​ మెట్రో స్టేషన్​లోని ఓ హోటల్‌లో, టోలిచౌకి, చాంద్రాయణగుట్ట, కాటేదాన్, బంజారాహిల్స్‌లోని పలు హోటళ్లలోని మండి బిర్యానీ, బర్గర్లు, షవర్మ, బల్దియాకు వరుస ఫిర్యాదులు అందాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లోని ప్రముఖ హోటళ్లు, పబ్బులు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లలో జరిపిన తనిఖీల్లోనూ చీఫ్​ క్వాలిటీ మయోనైజ్‌ను అధికారులు గుర్తించారు. ఉడికించని పదార్థమైనందున మయోనైజ్‌లో హానికరమైన బాక్టీరియా విపరీతంగా వృద్ధి చెందుతుంది. చట్నీగా ఉపయోగించే మయోనైజ్‌ను గుడ్డులోని పచ్చసొన, నూనె, ఉప్పు, నిమ్మరసం, తయారు చేస్తారు.

త్వరలో హైదరాబాద్​లో మయోనైజ్​ తినడం కుదరదు!

మయోనైజ్‌ తిని 17 మందికి అస్వస్థత - రక్తపరీక్షల్లో ఏం తేలిందంటే?

Last Updated : Oct 30, 2024, 7:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.