ETV Bharat / state

నేటి నుంచి మీ ఇళ్లకు ఇందిరమ్మ ఇళ్ల సర్వేయర్లు - 'యాప్​' ఓకే అంటే మీకు ఇల్లు వచ్చేసినట్లే! - INDIRAMMA HOUSING APP

అందుబాటులోకి వచ్చిన ఇందిరమ్మ ఇళ్ల యాప్‌ - లబ్ధిదారుల ఎంపికలో కీలక పాత్ర పోషించనున్న యాప్ - నేటి నుంచి వివరాలు సేకరించనున్న సర్వేయర్లు

Indiramma Housing Beneficiary App In Use
Indiramma Housing Beneficiary App In Use (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 6, 2024, 8:02 AM IST

Indiramma Housing Beneficiary App In Use : ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఇందిరమ్మ ఇళ్ల యాప్ అందుబాటులోకి వచ్చేసింది. సర్కార్‌ అందించే ఇళ్ల కోసం లబ్ధిదారులను ఈ యాప్‌ ద్వారానే గుర్తిస్తారు. రాష్ట్రంలో మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, మెదక్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని రెండేసి ప్రాంతాల్లో పైలెట్‌ ప్రాజెక్టుగా ఈ యాప్‌ను ఇప్పటికే పరిశీలించారు. విజయవంతం కావడంతో దీన్ని వినియోగంలోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అధికారికంగా గురువారం యాప్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించడంతో సర్వేయర్లు దరఖాస్తుదారుల ఇంటిబాట పట్టనున్నారు. ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం రూపొందించిన యాప్‌తో పాటు ప్రభుత్వం మూడు ఇళ్ల ఆకృతులను రూపొందించింది. తక్కువ స్థలంలో రెండు గదులు, వంట గది, బాత్రూం వంటివి ఉండేలా ఇంజినీర్లు ఆకృతులను రూపొందించారని, యాప్‌ను సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ అభివృద్ధి చేసిందని అధికారులు తెలిపారు.

ప్రజా పాలన కార్యక్రమంలో సొంత ఇళ్లు కావాలంటూ రాష్ట్రవ్యాప్తంగా 80,54,554 మంది దరఖాస్తులు సమర్పించగా, అందులో ఆహార భద్రత కార్డుతో పోలినవి 53,95,424 ఉన్నాయి. గతంలో 12,72,019 కుటుంబాలు ఇళ్లు లబ్ధి పొందినట్లు అధికారులు గుర్తించారు. ఆహార భద్రత కార్డుతో పోలి, గతంలో ఎలాంటి ఇళ్లు తీసుకోని కుటుంబాలు 41,23,405 ఉన్నట్లు వెల్లడించారు.

లబ్ధిదారుల గుర్తింపులో భాగంగా ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తుదారుల ఇంటికి సర్వేయర్‌ వెళ్లి, అందులో ఆయా వివరాలు నమోదు చేస్తారు. సర్వేను గెజిటెట్‌ స్థాయి అధికారి పర్యవేక్షిస్తారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి, పురపాలికలోని వార్డుల్లో వార్డు అధికారి ద్వారా ఈ సర్వే నిర్వహిస్తున్నారు. అనర్హులకు ఇళ్లు మంజూరు కాకుండా ఎంపీడీవోలు, పురపాలిక కమిషనర్లు కూడా సర్వే పర్యవేక్షణ చేపట్టనున్నారు.

గుడ్​న్యూస్ - ఇందిరమ్మ ఇళ్ల కోసం 'యాప్' సిద్ధం - రేపటి నుంచే లబ్ధిదారుల ఎంపిక

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వినియోగం : యాప్‌లో కృత్రిమ మేధను ఉపయోగించనున్నారు. ఇందులో భాగంగా లబ్ధిదారుడి ముఖాన్ని గుర్తిస్తారు. ఇంటిని నిర్మించే స్థలానికి భౌగోళిక అక్షాంశాలు, రేఖాంశాల వివరాలను కూడా అందులో నమోదు చేస్తారు. ఇళ్ల నిర్మాణ ప్రగతిని ఏఐ ఆధారిత ఫొటోలు తీస్తారు. లబ్ధిదారుడికి ఇచ్చే సొమ్ము ఆధార్ ఆధారిత బ్యాంకుకు బదిలీ చేసేందుకు కూడా ఏఐనే ఉపయోగించనున్నారు.

360 డిగ్రీల సమాచారంతో అనర్హుల గుర్తింపు : ఇళ్ల లబ్ధిదారుల వివరాలను 360 డిగ్రీల కోణంలో అధికారులు పరిశీలించనున్నారు. ఇందిరమ్మ ఇళ్లలో ఎవరైనా అనర్హులు ఎంపికైతే వారిని సులువుగా ఈ మార్గంలో గుర్తించవచ్చు. ఇందులో మూడు/ నాలుగు వాహనాలున్న కుటుంబాలు, వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు, ప్రభుత్వ ఉద్యోగి, ఆస్తి పన్ను చెల్లిస్తున్న వారు, ఇతర పథకాల ద్వారా గతంలో ఇళ్లు లబ్ధి పొందిన కుటుంబాలను 360 డిగ్రీల సమాచారంలో వివరాలు తీసుకుంటారు.

రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేయనుంది. మొత్తం గరిష్ఠంగా 4.50 లక్షల ఇళ్లను అందించాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది. ఇంటి నిర్మాణానికి కనీసం 400 చదరపు అడుగుల స్థలం ఉండాలి. ఆ ప్రకారం నమూనాతో ప్రతి మండల కేంద్రంలో ఓ ఇళ్లు నిర్మించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. నమూనా ప్రకారం ఇల్లు ఏ విధంగా ఉంటుందో లబ్ధిదారులు పరిశీలించి, నిర్మించుకోడానికి వీలుంటుందని సర్కార్‌ భావిస్తోంది.

ఇష్టం వచ్చినట్లు నిర్మించుకోవచ్చు : కచ్చితంగా ఇంటిని ఇలానే నిర్మించుకోవాలి అనేది ఏమీ లేదు. అయితే పేదలు ప్రభుత్వం ఇచ్చే రూ.5 లక్షల డబ్బుతోనే ఇల్లు నిర్మించుకునేందుకు ఈ నమూనా ఉపయోగపడుతుంది. 400 చదరవు అడుగుల కంటే అధికంగా స్థలం ఉన్నవారు సర్కార్‌ ఇచ్చే డబ్బుతో పాటు అదనంగా ఖర్చు చేసి, తమకు నచ్చినట్లు ఇళ్లు నిర్మించుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇంటి నిర్మాణంలో రెండు గదులు, వంటగది, బాత్రూం మాత్రం కచ్చితంగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు.

యాప్‌లో నమోదు చేయాల్సిన వివరాలు

  • ప్రస్తుతం నివసిస్తున్న ఇంటి స్వరూపం
  • ఇళ్లు నిర్మించుకోవడానికి భూమి ఉందా? లేదా?
  • స్థలం లబ్ధిదారుడి పేరు మీద ఉందా? కుటుంబ సభ్యుల పేరు మీద ఉందా?
  • ఇంట్లో వివాహిత జంటల సంఖ్య
  • ప్రస్తుత గ్రామం/ పట్టణంలో ఎన్నేళ్లుగా నివసిస్తున్నారు

ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్‌ ఆవిష్కరణ - రేపటి నుంచి లబ్ధిదారుల నమోదు

ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి గుడ్​న్యూస్ - త్వరలోనే ప్రభుత్వ మోక్షం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.