ETV Bharat / state

ఫోన్​ట్యాపింగ్​కు పర్మిషన్ ఇచ్చేది హోంశాఖే - హైకోర్టుకు కేంద్రం నివేదిక - Phone Tapping Case Latest Update - PHONE TAPPING CASE LATEST UPDATE

Phone Tapping Case Latest Update : ఫోన్​ ట్యాపింగ్​కు అనుమతి ఇచ్చేది రాష్ట్ర హోంశాఖే అంటూ కేంద్రం హైకోర్టుకు నివేదిక ఇచ్చింది. రాష్ట్రప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్​ పిటిషన్​ రికార్డుల్లో లేనందున న్యాయస్థానం ఈ విచారణను 23కు వాయిదా వేసింది. ఇప్పటికే ఈ కేసును హైకోర్టు సుమోటోగా తీసుకుంది.

Phone Tapping Case Latest Update
Phone Tapping Case Latest Update (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 4, 2024, 12:02 PM IST

Telangana High Court on Phone Tapping Case : రాష్ట్రవ్యాప్తంగా ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారం సంచలనంగా మారింది. ఈ వ్యవహారంలో రోజుకో కొత్త కోణం బయటకు వస్తోంది. ఈ క్రమంలో ఫోన్​లను ట్యాప్​ చేయాల్సి వస్తే ఆయా రాష్ట్రాల హోంశాఖలే అనుమతులు మంజూరు చేస్తాయని కేంద్రం బుధవారం రోజున తెలంగాణ హైకోర్టుకు నివేదించింది. దీనికి కేంద్ర హోంశాఖ అనుమతులు అవసరం లేదని కేంద్రం తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు.

సస్పెండెడ్​ అయిన ఎస్​ఐబీ అదనపు ఎస్పీ భుజంగరావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా రాజకీయ ప్రత్యర్థులు, ప్రైవేటు వ్యక్తులతో పాటు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్​లను ట్యాప్​ చేసినట్లు పత్రికల్లో వచ్చిన కథనాలను హైకోర్టు సుమోటోగా తీసుకుని ఫోన్​ ట్యాపింగ్​ కేసును విచారిస్తుందనే విషయం విదితమే. ఈ పిటిషన్​పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఆలోక్​ అరాధే, జస్టిస్​ టి. వినోద్​కుమార్​ల ధర్మాసనం విచారణ చేపట్టింది.

కేసు కౌంటర్​ను రికార్డుల్లో ఉంచాలి : రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్​ జనరల్​ మహమ్మద్​ ఇమ్రాన్​ఖాన్​ వాదనలు వినిపించారు. ఫోన్​ ట్యాపింగ్​పై ఇంతక్రితమే హైకోర్టులో దర్యాప్తు వివరాలతో కౌంటర్​ దాఖలు చేసినట్లు తెలిపారు. అయితే అది రికార్డుల్లో లేకపోవడంతో ఈ నెల 23కు విచారణను హైకోర్టు వాయిదా వేసింది. రాష్ట్రప్రభుత్వం వేసిన కౌంటర్​ను రికార్డుల్లో ఉంచాలని న్యాయస్థానం రిజిస్ట్రీకి ఆదేశాలు ఇచ్చింది. అలాగే న్యాయస్థానం ఓ సూచనను చేసింది. ఈ ట్యాపింగ్​ వ్యవహారంలో కౌంటరు దాఖలు చేయాలని భావిస్తే తదుపరి విచారణలోగానే చేయాలంటూ కేంద్రానికి సూచించింది.

తనను కూడా ప్రతివాదిగా చేర్చండి? : అయితే ఇక్కడ మరోవ్యక్తి సైతం ఈ కేసులో తనను ప్రతివాదిగా చేర్చుకోవాలంటూ సిద్దిపేట జిల్లాకు చెందిన మహమ్మద్​ హయతుద్దీన్​ ఇంప్లీడ్​ పిటిషన్​ను దాఖలు చేశారు. ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంలో హయతుద్దీన్​ కూడా బాధితుడేనని ఆయన తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. పిటిషనర్​ కూడా నాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారని దాంతో ఆయన కేసులు వాదిస్తున్న న్యాయవాదులు, న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాపింగ్​ అయ్యాయని, డీజీపీకి పలు సందర్భాల్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని పేర్కొన్నారు. పిటిషనర్​ ఫోన్​ను ట్రాక్​ చేయడం ద్వారా ఎక్కడున్నాడో తెలుసుకొని బెదిరించేవారని కోర్టుకు వివరించారు. ఈ అంశంపై ఆయనను ప్రతివాదిగా చేర్చాలా లేదా అనేది తదుపరి విచారణలో తెలుపుతామని హైకోర్టు తెలిపింది.

ఫోన్​ ట్యాపింగ్​ కేసు అప్​డేట్​ - రేవంత్ రెడ్డిపై స్పెషల్ నిఘా - కుట్రలో ఎమ్మెల్సీ నవీన్​రావు - TELANGANA PHONE TAPPING CASE UPDATE

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సామాన్యమైన విషయం కాదు - వ్యక్తిగత గోప్యతలోకి చొరబడ్డమే : హైకోర్టు - TELANGANA HC ON PHONE TAPPING CASE

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.