Telangana Budget on 25th of this Month : బడ్జెట్ ప్రతిపాదనలను చర్చించి అసెంబ్లీలో ప్రవేశ పెట్టేందుకు అనుమతి ఇవ్వడం కోసం రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 25న సమావేశం కానుంది. ఉదయం 9:30 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. అదే రోజున అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.
బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సచివాలయంలో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. శాసనసభ్యులు లేవనెత్తే ప్రశ్నలకు వీలైనంత త్వరగా కచ్చితమైన సమగ్ర సమాచారంతో సమాధానాలు పంపాలని ఆమె అధికారులను ఆదేశించారు. సమావేశాలు జరుగుతున్నప్పుడు సమన్వయ, సమాచార లోపం లేకుండా సీనియర్ అధికారులు అసెంబ్లీలో తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని ఆమె సూచించారు.
రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఈ నెల 25న ప్రవేశపెట్టనున్నట్లు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు తెలిపారు. ఆ తర్వాత రోజుల్లో వివిధ శాఖల డిమాండ్లపై చర్చ ఉంటుందన్నారు. నోట్ ఆన్ డిమాండ్ రూపొందించి బడ్జెట్‌ను సిద్ధంగా ఉంచాలని, మంత్రులు, సభ్యులు దానిని పరిశీలించి చర్చకు సంబంధించిన విషయాలను లేవనెత్తడానికి తగిన సమయం ఉంటుందని ఆయన అధికారులను కోరారు. సమావేశంలో వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు పాల్గొన్నారు.
ఈనెల 25న తెలంగాణ బడ్జెట్! - రూ. 2.50 లక్షల కోట్లతో పద్దు? - TELANGANA BUDGET 2024
పక్కాగా లెక్కలు వేసి - అంతమేరకే కేటాయింపులు : ఆదాయ, వ్యయాలపై భారీ అంచనాలతో కాకుండా... ఎంతమేరకు ఆదాయం వస్తుందనేది పక్కాగా లెక్కలు వేసి అంతమేరకే కేటాయింపులతో రూపొందించాలని ప్రభుత్వం నిర్దేశించింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్లలో ఒక్కసారి కూడా బడ్జెట్ అంచనాల ప్రకారం వంద శాతం వ్యయం చేయలేదని, ఈ ఏడాది ఆ లక్ష్యాన్ని సాధించేలా వాస్తవిక దృక్పథంతో పద్దు ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది.
గత పదేళ్లలో 2019-20లో మాత్రమే బడ్జెట్ అంచనాల్లో 97.5% వ్యయమైందని శ్వేతపత్రంలో రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది రాష్ట్ర ఆదాయం, రుణాల సేకరణ పెరుగుతున్నందున బడ్జెట్ రూ.2.50 లక్షల కోట్ల వరకు చేరే అవకాశాలున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈనెల 23న పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెడుతున్నందున వెంటనే రాష్ట్ర బడ్జెట్‌కు నిధుల కేటాయింపుపై తుదిరూపు ఇవ్వనున్నారు. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు, బహిరంగ మార్కెట్ నుంచి సేకరించే రుణాలు కలిపి రూ.60 వేల కోట్లకు పైగానే ఉండవచ్చని ప్రాథమిక అంచనా.