TGSPSC Group 1 Prelims : రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పరీక్షకు 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 31 జిల్లాల్లో 897 పరీక్ష కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన పరీక్ష మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రశాంతంగా సాగింది.
Group 1 Exam : వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 563 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన గ్రూప్ -1 ప్రశాంతంగా సాగింది. ఉదయం 10 గంటల వరకే అనుమతిస్తామని టీజీపీఎస్సీ ప్రకటించటంతో అభ్యర్థులు ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. ఐతే కొన్ని పరీక్షా కేంద్రాల వద్ద కొందరు అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో నిరాశతో వెనుదిరిగారు. ప్రతి కేంద్రానికి ఒక సిట్టింగ్ స్క్వాడ్ బృందంతో పాటు 3 నుంచి 5 కేంద్రాలకు ఓ ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాన్ని ఏర్పాటు చేశారు.
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్లలో స్వల్పమార్పులు - ఏంటంటే
Group 1 Exam in Telangana : హైదరాబాద్ సహా వివిధ కేంద్రాల్లో గ్రూప్ -1 ప్రిలిమినరీ ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసింది. అబిడ్స్ స్టాన్లీ కాలేజ్ పరీక్ష కేంద్రానికి అభ్యర్థులు గంట ముందే తరలివచ్చారు. అధికారులు విధించిన నిబంధనలు పాటించాలని పరీక్షా కేంద్రాల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఏర్పాటు చేసిన కేంద్రానికి పలువురు అభ్యర్థులు ఆలస్యంగా కేంద్రానికి రాగా అనుమతించ లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆలస్యంగా వచ్చివారికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటకి పంపంచారు. ఉదయం 10:30 గంటలకు ప్రారంభమైన పరీక్ష మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రశాంతంగా సాగింది.
"ఇప్పటికే నేను మూడుసార్లు గ్రూప్స్ పరీక్షలకు అటెండ్ అయ్యాను. కానీ ఎగ్జామ్ క్రాక్ చేయలేకపోయా, అయినప్పటికీ నాల్గోసారి ప్రయత్నం చేశాను. ఇప్పుడేమో డిపోజిట్ దగ్గర ఆలస్యమైనాసరే, మాదే తప్పు అన్నట్లు మమ్మల్ని అనుమతించటంలేదు." -గ్రూప్-1 అభ్యర్థి
Implementation Of Section 144 In Exam Centers : పరీక్షను నిఘానేత్రాల పర్యవేక్షణలో నిర్వహించారు. ఇందుకోసం అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు అమర్చారు. పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేశారు. సమీపంలోని జిరాక్స్ కేంద్రాలు కూడా మూసివేశారు. ప్రతి కేంద్రం వద్ద భారీ బందోబస్తును అధికారులు ఏర్పాటు చేశారు.