ETV Bharat / state

టీజీపీఎస్సీ కీలక నిర్ణయం - పోటీ పరీక్షల ‘కీ’ సమస్యలకు చెక్‌ - TGSPSC Key Paper Issue - TGSPSC KEY PAPER ISSUE

TGPSC Prelims Answer Key Paper Issue : ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పోటీ పరీక్షల ‘కీ’ (సమాధానాల) సమస్యలకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీ​పీఎస్సీ) చెక్‌ పెట్టనుంది. ప్రాథమిక కీ వెలువడినప్పటి నుంచి తుది కీ ఖరారయ్యే నాటికి అభ్యర్థుల్లో తలెత్తుతున్న సందేహాలు, గందరగోళ పరిస్థితులను పరిష్కారం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది.

Competitive Exams In Telangana
TGSPSC Answer key Analysis (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 28, 2024, 9:16 AM IST

TGSPSC Answer key Analysis : ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పరీక్షల ‘కీ’ (సమాధానాల) సమస్యలకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీఎస్​పీఎస్సీ) పరిష్కారం చేయనుంది. ప్రాథమిక కీ వచ్చినప్పటి నుంచి తుది కీ ఖరారయ్యే నాటికి అభ్యర్థుల్లో చాలా సందేహాలు, గందరగోళ పరిస్థితులు ఎదురవుతున్నాయి. వీటిని దూరం చేసేందుకు టీజీపీఎస్సీ కార్యాచరణ సిద్ధం చేసింది.

పరీక్ష రాసే అభ్యర్థులకు మానసిక ఆందోళనను దూరం చేసేందుకు గత కొన్నేళ్లుగా అనుసరిస్తున్న విధానంలో మార్పులు చేపట్టింది. ఇక నుంచి ప్రాథమిక కీ విడుదల సమయంలోనే సమాధానాల్లో ప్రాథమిక తప్పులను గుర్తించి వాటిని సరిచేస్తూ సరైన సమాధానాలతో కీ ప్రకటించాలని నిర్ణయించింది. దీని ద్వారా పరీక్ష రాసిన అభ్యర్థులకు ప్రాథమిక కీలోనే ఎన్ని మార్కులు వస్తాయి? మెరిట్‌ సాధిస్తామా? లేదా వంటి అంశాలు ముందుగానే తెలుస్తాయి. భవిష్యత్తులో నిర్వహించే పోటీ పరీక్షలన్నింటిలోనూ ఇదే విధానాన్ని కమిషన్‌ కొనసాగించనుంది.

Competitive Exams In Telangana : పోటీపరీక్షలు నిర్వహించిన తరువాత కమిషన్‌ నిబంధనల ప్రకారం తొలుత అభ్యర్థుల ఓఎంఆర్‌ పత్రాలు స్కానింగ్‌ చేస్తారు. ఈ ప్రక్రియ ముగిసిన తరువాత డిజిటల్‌ ఓఎంఆర్‌ పత్రాలను వెబ్‌సైట్లో పొందుపరిచి ప్రాథమిక కీ ప్రకటిస్తారు. ఇంతకు ముందు ప్రాథమిక కీ విడుదల చేసేటప్పుడు ప్రశ్నపత్రం రూపొందించిన నిపుణులు చెప్పిన సమాధానాన్ని అందులో పొందుపరిచేవారు. అనంతరం ప్రాథమిక కీపై అభ్యర్థుల నుంచి నిర్ణీత సమయంలోగా అభ్యంతరాలు స్వీకరించి పరిశీలించేవారు. ఈ అభ్యంతరాలకు సరైన ఆధారాలు జతచేయాలి. లేకుంటే వాటిని పరిగణనలోకి తీసుకోరు.

టీఎస్​పీఎస్సీ గ్రూప్​ ఎగ్జామ్స్​ తేదీలు విడుదల - ఆగస్టులో గ్రూప్​2 పరీక్షలు

ఈ తరహా విధానంతో అభ్యర్థుల్లో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొనేవి. ప్రాథమిక కీలో వస్తున్న మార్కులకు తుది కీలో వస్తున్న మార్కులకు వ్యత్యాసం కనిపించేది. కొన్ని సందర్భాల్లో ఒక్క మార్కు తేడాతో ర్యాంకుల్లో చాలా వెనుకబాటు కనిపిస్తోంది. దీంతో మార్కులు తక్కువ వచ్చాయన్న ఆందోళన అభ్యర్థుల్లో నెలకొంటోంది. గతంలో చాలా సార్లు న్యాయ వివాదాలు తలెత్తి నియామక ప్రక్రియ ఆలస్యమయ్యేది. గత ఏడాది కమిషన్‌ నిర్వహించిన 8,180 గ్రూప్‌-4 సర్వీసు ఉద్యోగాల పోటీ పరీక్షలోనూ ప్రాథమిక కీ నుంచి తుది కీ వరకు పది ప్రశ్నలు తొలగించారు.

అభ్యర్థుల్లో గందరగోళం నివారణకు కార్యాచరణ : ఈ మేరకు పేపర్‌-1లో 7, పేపర్‌-2లో 3 ప్రశ్నలు ఉన్నాయి. వీటితో పాటు రెండు పేపర్లలో కలిపి 13 ప్రశ్నల సమాధానాల్లో మార్పులు జరిగాయి. 5 ప్రశ్నలకు ఒకటి కన్నా ఎక్కువ సమాధానాలు సరైనవిగా ప్రకటించాల్సి వచ్చింది. రద్దయిన గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షలోనూ తుది కీ వెలువడే నాటికి 8 ప్రశ్నలు తొలగించారు. రెండు ప్రశ్నలకు ఆప్షన్లు మారాయి. ఇదే తరహాలో ప్రతి పోటీపరీక్షలో ప్రశ్నల తొలగింపు, సమాధానాల మార్పు సాధారణంగా జరుగుతోంది.

దీంతో అభ్యర్థుల మార్కుల అంచనాలు మారుతున్నాయి. ఈ మేరకు అభ్యర్థుల్లో గందరగోళ పరిస్థితులు నివారించేందుకు ప్రాథమిక కీ సమయంలో సబ్జెక్టు నిపుణుల అభిప్రాయాన్ని కమిషన్‌ తీసుకుంటోంది. ప్రాథమిక కీ విడుదల చేసేటప్పుడు ఆ అభిప్రాయం మేరకు సరైన సమాధానాలతో వెలువరిస్తుంది. దీనిద్వారా ప్రాథమిక కీపై వెలువడే అభ్యంతరాల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. ప్రాథమిక కీ తుది కీ నాటికి పెద్దగా మార్పులు ఉండకపోవడంతో అభ్యర్థులకు వచ్చే మార్కులపై ముందుగానే అవగాహన వస్తుంది.

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో కఠిన నిబంధనలు - ఉల్లంఘిస్తే పరీక్షలు రాసేందుకు అనర్హులు - TGSPSC Group 1 Prelims Guidelines

టీఎస్​పీఎస్సీ కీలక నిర్ణయం - గ్రూప్‌ 1 నోటిఫికేషన్‌ రద్దు చేసినట్లు ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.