TGEAPCET 2024 Counselling Dates Change : తెలంగాణ ఈఏపీసెట్ ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ప్రవేశాల ప్రక్రియలో భాగంగా ఇంజినీరింగ్ కోర్సుల కౌన్సిలింగ్ ప్రక్రియ ఈనెల 27 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే టెక్నికల్ ఇనిస్టిట్యూషన్లకు జూన్ 30 వరకు అనుమతులు ఇవ్వాలని ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నిర్ణయం నేపథ్యంలో సాంకేతిక విద్యా కమిషనర్ కొత్త షెడ్యూల్ను ప్రకటించారు. దీని ప్రకారం ఈనెల 27 నుంచి ప్రారంభం కావాల్సిన ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ జులై 4 నుంచి ప్రారంభం కానున్నాయి.
కౌన్సెలింగ్ ప్రక్రియ విధానం : మొత్తం మూడు విడతల్లో కౌన్సిలింగ్ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. జులై 4న తొలి విడత కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. జులై 6 నుంచి 13 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. జులై 8 నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇచ్చి జులై 19న తొలివిడత సీట్ల కేటాయింపు పూర్తి చేయనున్నారు. ఇక జులై 26 నుంచి రెండో విడత కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. జులై 27న సర్టిఫికేట్ వెరిఫికేషన్, జులై 27,28 తేదీల్లో వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇవ్వనున్నారు. జులై 31న రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తి చేస్తారు.
ఆగస్టు 8 నుంచి మూడో విడత కౌన్సిలింగ్ ప్రక్రియను ప్రారంభించి ఆగస్టు 9న సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయనున్నారు. అదే రోజు నుంచి ఆగస్టు 10 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇచ్చి ఆగస్టు 13న ఆఖరి ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి చేయనున్నారు. కన్వీనర్ కోటా ఇంటర్నల్ స్లైడింగ్కి ఆగస్టు 21, 22 తేదీల్లో అవకాశం కల్పించి ఆగస్టు 26న సీట్ల కేటాయింపు పూర్తి చేయనున్నారు. ఆగస్టు 28న స్పాట్ అడ్మిషన్లు గైడ్ లైన్స్ విడుదల చేయనున్నట్లు కమిషనర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కన్వీనర్ బుర్రా వెంకటేశం ప్రకటించారు.
TGEAPCET New Councelling Dates :
- తొలివిడత కౌన్సిలింగ్ : జులై 4న తొలి విడత కౌన్సిలింగ్ ప్రారంభం. జులై 6 నుంచి 13 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయనున్నారు. జులై 8 నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం. జులై 19న తొలి విడత సీట్ల కేటాయింపు పూర్తి.
- రెండో విడత కౌన్సిలింగ్ : జులై 26 నుంచి రెండో విడత కౌన్సిలింగ్ ప్రారంభం. జులై 27న సర్టిఫికేట్ వెరిఫికేషన్. జులై 27,28 తేదీల్లో వెబ్ ఆప్షన్లకు అవకాశం. జులై 31న రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తి.
- మూడో విడత కౌన్సిలింగ్ : ఆగస్టు 8 నుంచి మూడో విడత కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం. ఆగస్టు 9న సర్టిఫికేట్ వెరిఫికేషన్. అదే రోజు నుంచి ఆగస్టు 10 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం. ఆగస్టు 13న ఆఖరి ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి.
- కన్వీనర్ కోటా ఇంటర్నల్ స్లైడింగ్ ఆగస్టు 21,22 తేదీల్లో, ఆగస్టు 26న సీట్ల కేటాయింపు పూర్తి.
- ఆగస్టు 28న స్పాట్ అడ్మిషన్లు గైడ్ లైన్స్ విడుదల
స్టడీ గ్యాప్ వచ్చినవారు - ఎంసెట్, నీట్ వంటి పరీక్షలు రాయొచ్చా?
తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల - ఇంజినీరింగ్ ర్యాంకుల్లో బాలుర సత్తా - TS EAPCET Results 2024