ETV Bharat / state

పోలీసు యాప్స్​ హ్యాక్ చేసి టెలిగ్రామ్​లో డేటా అమ్మకం - ఎట్టకేలకు దొరికిన నిందితుడు - telangana Police Department Apps Hacker arrested - TELANGANA POLICE DEPARTMENT APPS HACKER ARRESTED

20 Years Old Hacker Arrested : తెలంగాణ పోలీసు శాఖకు సంబంధించిన యాప్​లను హ్యాక్​ చేస్తున్న వ్యక్తిని సోషల్​ ఇంజినీరింగ్​ సాయంతో టీజీసీఎస్​బీ పట్టుకుంది. అతనిని దిల్లీలో అరెస్టు చేయగా హైదరాబాద్​కు తరలించారు. విచారణలో ఆధార్​ డేటా, ఏజెన్సీల డేటాను కూడా లీక్​ చేసినట్లు తెలిపాడు.

TG POLICE APPS Hacker Arrested
TG POLICE APPS Hacker Arrested (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 10, 2024, 12:46 PM IST

Telangana Police Arrested Police Department Apps Hacker : ఓ వ్యక్తి ఇటీవల కాలంలో తెలంగాణ పోలీసు యాప్​లను హ్యాక్​ చేసి అందులోని డేటాను టెలిగ్రామ్​లో అమ్మకానికి పెట్టిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని సీరియస్​గా తీసుకున్న తెలంగాణ సైబర్​ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్​బీ) నిందితుడిని ఎట్టకేలకు అరెస్టు చేసింది. హ్యాకర్ దిల్లీలోని ఉంటున్న విద్యార్థి జతిన్​కుమార్​గా గుర్తించారు. శనివారం అక్కడకు వెళ్లి అరెస్టు చేసిన అనంతరం హైదరాబాద్​కు తరలించారు. పోలీసులకు దొరకకుండా ఉండేందుకు అనేక ప్రయత్నాలు చేసినా చివరికి టెక్నాలజీ సాయంతో అధికారులు చాకచక్యంగా అరెస్టు చేశారు.

తెలంగాణ సైబర్​ సెక్యూరిటీ బ్యూరో తెలిపిన వివరాల ప్రకారం : తెలంగాణ పోలీసు శాఖకు చెందిన హ్యాక్​ ఐ యాప్​ను ఓ గుర్తు తెలియని వ్యక్తి హ్యాక్​ చేసినట్లు టీజీసీఎస్​బీ ఇటీవల ఓ కేసును నమోదు చేసింది. ఈ కేసు దర్యాప్తులో ఉండగానే తెలంగాణ పోలీసు శాఖకు చెందిన టీఎస్​ కాప్​ యాప్​, ఎస్​ఎంఎస్​ సర్వీసెస్​లోని డేటాను కూడా హ్యాకింగ్​ చేసి చోరీ చేశాడు. ఈ మొత్తం డేటాను 150 అమెరికన్​ డాలర్లకు విక్రయిస్తానంటూ అంతర్జాలంలో పోలీసులకు ఓ లింక్​ కనిపించింది. దీంతో వారు అప్రమత్తమయ్యారు. ఈ విషయాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించి హ్యాకర్​ను పట్టుకునేందుకు శ్రమించారు.

పోలీసుల డేటాను కొనుగోలు చేయదలిచినవారు తమను సంప్రదించాలంటూ హ్యాకర్​ రెండు టెలిగ్రామ్​ ఐడీలను నెట్టింట పొందుపరిచాడు. ఆ వ్యక్తిని గుర్తించకుండా ఉండేందుకు పలు జాగ్రత్తలు తీసుకున్నాడు. అయితే ఇక్కడే టీజీసీఎస్​బీ పోలీసులు చాకచక్యంగా సోషల్​ ఇంజినీరింగ్​ విధానాన్ని వినియోగించి హ్యాకర్​ జతిన్​ కుమార్​ దిల్లీలో ఉన్నట్లు గుర్తించారు. అనంతరం దిల్లీ వెళ్లి ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. ఆ యువకుడు ఉత్తరప్రదేశ్​లోని ఝాన్సీ నగరానికి చెందినవాడు. ముందుగా అక్కడి న్యాయస్థానంలో హాజరు పరిచి అనంతరం ట్రాన్సిట్ ​రిమాండుపై హైదరాబాద్​ తీసుకువచ్చారు.

నిందితుడిని పట్టించిన సోషల్​ ఇంజినీరింగ్​ : నిందితుడిని విచారించిన క్రమంలో చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు గతంలోనూ ఈ తరహా సైబర్​ నేరాలకు పాల్పడినట్లు గుర్తించారు. ఆధార్​తో పాటు కీలక ఏజెన్సీలకు సంబంధించిన డేటాను లీక్​ చేసినట్లు చెప్పారు. బ్యూరో డైరెక్టర్​ శిఖా గోయెల్​ పర్యవేక్షణలో తక్కువ సమయంలోనే ఈ కేసును పరిష్కరించిన టీమ్​ను డీజీపీ రవిగుప్తా అభినందించారు. పోలీసుశాఖకు చెందిన యాప్​లు హ్యాక్​ అయినా వినియోగదారుల సున్నిత, ఆర్థిక డేటాకు వచ్చిన ఇబ్బందేమీ లేదని అన్నారు. ఇలాంటి పనులు చేసేవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

యాపిల్‌ యూజర్లకు 'హై-రిస్క్‌' అలర్ట్‌ - ఐఫోన్​, ఐపాడ్​ల్లో సెక్యూరిటీ లోపాలు! - HIGH RISK WARNING FOR IPHONE USERS

ఐసీఐసీఐ కస్టమర్లకు అలర్ట్​ - ఆ వాట్సాప్ మెసేజెస్, కాల్స్ నమ్మితే ఇక అంతే! - ICICI Bank Fraud Alert

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.