ETV Bharat / state

ప్రారంభమైన 'టీజీ' రిజిస్ట్రేషన్- ఫ్యాన్సీనెంబర్లతో మొదటిరోజే కాసుల గలగల - TS to TG registrations from today

TS to TG Registrations from Today : నేటి నుంచి వాహనాల నంబర్ ప్లేట్లను టీజీ పేరుతో రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్రంలో వాహనాల నంబర్ ప్లేట్​లను టీఎస్ నుంచి టీజీగా మార్చుతూ కేంద్రం ఇప్పటికే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో రవాణా శాఖలో అధికారులు అందుకు అవసరమైన మార్పులు చేశారు. నంబర్ ప్లేట్లను టీజీగా మార్చిన మొదటి రోజే, ఫ్యాన్సీ నంబర్లతో రవాణాశాఖకు కాసుల వర్షం కురిసింది. ప్రత్యేక నంబర్లతో లక్షల్లో ఆదాయం సమకూరింది.

TG Registrations for New Vehicles
TS to TG Registrations from Today
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 15, 2024, 9:56 PM IST

TS to TG Registrations from Today : తెలంగాణ రాష్ట్రంలో వాహనాల నంబర్ ప్లేట్లలో మార్పులు చోటు చేసుకున్నాయి. నేటి నుంచి వాహనాల నంబర్ ప్లేట్లను టీజీ పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తున్నామని రవాణాశాఖ కమిషనర్ బుద్ద ప్రకాష్ తెలిపారు. ఖైరతాబాద్​లోని రవాణాశాఖ కార్యాలయంలో(RTA Office) టీఎస్ నుంచి టీజీగా మారిన వాహనాల నంబర్ల ప్లేట్లను, రిజిస్ట్రేషన్ పేపర్లను వాహనదారులకు రవాణాశాఖ అధికారులు అందజేశారు.

TG Registrations for New Vehicles : తెలంగాణ ఉద్యమ సమయంలో వాహనాల నంబర్ ప్లేట్లను ఏపీ నుంచి టీజీగా అతికించామని అది ఆత్మగౌరవానికి ప్రతీకగా ఆనాడు చెప్పుకున్నామని బుద్ద ప్రకాష్ పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం రేపటి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోబోయే వాహనాలు అన్నింటికి టీజీ పేరుతోనే రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు. ఏ వాహనం అయినా రిజర్వేషన్ చేసుకున్న 15 రోజుల లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే టీఎస్ నంబర్ ప్లేట్లతో ఉన్న వాహనాలను టీజీగా మార్చే అవకాశం లేదని రవాణాశాఖ స్పష్టం చేసింది.

చట్టంలో ఎలాంటి వెసులుబాటు లేన్నందున టీఎస్ వాహనాలు టీఎస్ పేరుతోనే కొనసాగుతాయి. కేవలం కొత్తగా రిజిస్ట్రేషన్ అయిన వాహనాలు మాత్రమే టీజీ పేరుతో రిజిస్ట్రేషన్ అవుతాయని రవాణాశాఖ స్పష్టం చేస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏపీ పేరుతో రిజిస్ట్రేషన్ అయిన వాహనాల సంఖ్య 70,68,252 వరకు ఉన్నాయి. టీఎస్ పేరుతో రిజిస్ట్రేషన్ అయిన వాహనాల సంఖ్య 92,82,903 వరకు ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ అయిన వాహనాలు 1,63,51,155 వరకు ఉన్నాయి.

TG Fancy Numbers Auction : ఫ్యాన్సీ నంబర్లతో రవాణాశాఖకు కాసుల వర్షం కురిసింది. టీజీగా మార్చిన మొదటి రోజే ఫ్యాన్సీ నంబర్లతో రవాణాశాఖకు భారీగా ఆదాయం సమకూరిందని రవాణాశాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్ సెంట్రల్ జోన్​లోని బండ్లగూడలో టీజీ12 0999 ఫ్యాన్సీ నంబర్ కు రూ.1,30,009 ధర పలికింది. ఈ నంబర్​ను దాసరి వెంకటేశ్వర ప్రసాద్ దక్కించుకున్నారు. టీజీ12 0786 ఫ్యాన్సీ నంబర్ కు రూ. 74,786 ధర పలికింది. ఈ నంబర్ ను నజీయా సుల్తానా దక్కించుకున్నారు.

ఆర్టీఏ వెస్ట్ జోన్​లోని టోలీచౌకీ రవాణాశాఖ కార్యాలయంలో టీజీ13 0001 నంబర్​కు రూ.1,61,111 ధర పలికింది. ఈ నంబర్​ను శ్రీ లక్ష్మీ గణపతి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు దక్కించుకున్నారు. టీజీ13 1000 నంబర్​కు రూ.60,000ల ధర పలికింది. ఈ నంబర్ మహ్మద్ అశాన్ ఖాన్ దక్కించుకున్నారు. సౌత్ జోన్ రవాణాశాఖ కార్యాలయంలో టీజీ12 0007 నంబర్ కు రూ.44,500లు, టీజీ12 0786 నంబర్ కు రూ. 74,786లు, టీజీ12 0999 నంబర్​కు రూ.1,30,009లు ఈ మూడు ఫ్యాన్సీ నంబర్లకు కలిపి రూ. 3,33,295ల ఆదాయం సమకూరినట్లు రవాణాశాఖ అధికారులు తెలిపారు.

నేటి నుంచి ‘టీజీ’ కోడ్‌తో రిజిస్ట్రేషన్‌ - ఇప్పటికే నడుపుతున్న వాహనాల పరిస్థితి ఏంటంటే?

రాష్ట్రచిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహమార్పుపై మండలిలో వాడివేడి చర్చ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.