ETV Bharat / state

ఎట్టకేలకు ఎల్‌ఆర్‌ఎస్‌కు మోక్షం - ఈ వారం నుంచే దరఖాస్తుల పరిశీలన - 3 నెలల్లో క్రమబద్ధీకరణ - Telangana Govt Focus ON LRS - TELANGANA GOVT FOCUS ON LRS

Telangana Govt Focus ON LRS : ఎట్టకేలకు చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ వారం నుంచే దరఖాస్తులను పరిశీలించాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. అర్హత ఉంటే 3నెలల్లో క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం సూచించింది. ప్లాట్లను 3దశల్లో, లేఅవుట్లను 4దశల్లో క్రమబద్ధీకరించాలని మార్గదర్శకాలు జారీ చేసింది.

Telangana Govt Focus ON LRS
Telangana Govt Focus ON LRS (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 1, 2024, 8:23 AM IST

Updated : Aug 1, 2024, 8:38 AM IST

Telangana Govt Focus ON LRS : రాష్ట్రంలో అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు సంబంధించి సర్కారు చర్యలు చేపట్టింది. మూడు నెలల్లో ఎల్​ఆర్​ఎస్ దరఖాస్తులను పరిశీలించి అర్హమైన వాటిని క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు మొదటి వారం నుంచే ఈ ప్రక్రియ ప్రారంభించాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి మార్గదర్శకాలను జారీచేశారు. ప్లాట్​ల అప్లికేషన్లను మూడు దశల్లో, లే అవుట్ల దరఖాస్తులను నాలుగు దశల్లో పరిశీలించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. అనంతరం వాటిలో అర్హమైన వాటిని నిర్ణీత ఫీజులు వసూలు చేసి క్రమబద్ధీకరిస్తారు.

25 లక్షల దరఖాస్తులు : స్థలాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణకోసం 2020 నుంచి సుమారు 25లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. కోర్టుల్లో కేసుల కారణంగా అవి పరిష్కారానికి నోచుకోలేదు. ఇళ్లు నిర్మించుకోవాలనుకునేవారికి మాత్రం 'న్యాయస్థానం తీర్పునకు లోబడతామంటూ' అఫిడవిట్‌ తీసుకుని అధికారులు అనుమతులు ఇచ్చారు. డిసెంబరులో అధికారం చేపట్టిన నాటి నుంచి ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిశీలనపై తర్జనభర్జన పడిన కాంగ్రెస్​ సర్కారు ఎట్టకేలకు ఇప్పుడు నిర్ణయం తీసుకుంది. దీంతో దరఖాస్తుదారుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

దరఖాస్తులను సీజీజీ పరిశీలించాకే : ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ ముందస్తు పరిశీలిస్తుంది. నిబంధనల ఆధారంగా కంప్యూటర్‌ ద్వారా వడపోత జరుగుతుంది. ఆయా ఆస్తులు నిషేధిత జాబితాలో ఉంటే గుర్తించి వాటిపై దరఖాస్తుదారులకు సమాచారం పంపుతుంది. దరఖాస్తుదారులు పూర్తిస్థాయి పత్రాలు ఇవ్వకపోయినా దానిపైనా సమాచారాన్ని పంపుతుంది. అనంతరం మిగిలిన ఎల్​ఆర్​ఎస్​ దరఖాస్తులను రెవెన్యూ, నీటిపారుదల, టౌన్‌ ప్లానింగ్, పంచాయతీ అధికారు లబృందం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తుంది.

పెండింగ్​లో 25 లక్షల ఎల్​ఆర్​ఎస్ ​దరఖాస్తులు - కాంగ్రెస్​ సర్కార్​ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ

నాలాలు, చెరువులు, వారసత్వ సంపద, శిఖం, దేవాదాయ, ఇనాం భూములు తదితర కోణాల్లో పరిశీలించి అభ్యంతరాలను నమోదు చేస్తారు. ఆయా వివరాలను సీజీజీ రూపొందించిన సెల్‌ఫోన్‌ యాప్‌లో నమోదు చేస్తారు. రెండోదశలో మరింత అధ్యయనం చేసి అర్హమైనవైతే నిర్ధారితఫీజు చెల్లించాలని దరఖాస్తుదారులకు నోటీసులు జారీచేస్తారు. క్షేత్రస్థాయి పరిశీలనలో అర్హమైనవి కాదని గుర్తిస్తే అలాంటి దరఖాస్తులను తిరస్కరిస్తారు. ఆ మేరకు దరఖాస్తుదారులకు సమాచారం ఇస్తారు. మూడోదశలో అర్హమైన దరఖాస్తుదారులు ఫీజులు చెల్లించినట్లు నిర్ధారించాక క్రమబద్ధీకరణ ఉత్తర్వులు జారీచేస్తారు. లేఅవుట్లకు సంబంధించి అదనపు కలెక్టర్‌ ఆధ్వర్యంలోని వివిధ విభాగాల అధికారులు పరిశీలన చేస్తారు.

హెల్ప్​లైన్​ సెంటర్లు ఏర్పాటు : క్రమబద్ధీకరణ దరఖాస్తులపై జారీచేసిన నోటీసులకు సంబంధించిన సమస్యలను నివృత్తి చేసేందుకు అన్ని జిల్లా కలెక్టరేట్లు, స్థానిక సంస్థల కార్యాలయాల్లో సహాయ కేంద్రాలు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్, హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ, మున్సిపాలిటీలు మినహా మిగిలిన ప్రాంతాల దరఖాస్తులను జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియలో భాగస్వాములయ్యే అన్ని స్థాయుల సిబ్బంది, అధికారులకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.

land Regularization : భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తుల విధివిధానాల్లో మార్పులు

Last Updated : Aug 1, 2024, 8:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.