TG EDCET Result Release Today 2024 : రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరంలో బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన తెలంగాణ ఎడ్‌సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్ లింబాద్రి పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఎడ్ సెట్‌కు 29,463 మంది విద్యార్థుల పరీక్షకు హాజరు కాగా 28,549 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులు అయ్యారు. ఎడ్‌సెట్‌లో 96.90 శాతం మంది ఉత్తీర్ణత సాదించారు. నాగర్‌కర్నూల్‌కు చెందిన నవీన్ మొదటి ర్యాంకు సాధించాడు. హైదరాబాద్‌కు చెందిన యువతి అషితకు రెండో ర్యాంక్ , మూడో స్థానంలో శ్రీతేజ నిలిచారు.
TG EDCET Result Release Today : నల్గొండలోని మహాత్మాగాంధీ వర్సిటీ ఆధ్వర్యంలో మే 23న జరిగిన ఎడ్‌సెట్ పరీక్ష ప్రిలిమినరీ కీని ఇటీవల విడుదల చేసిన అధికారులు తాజాగా ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30వేల మంది హాజరయ్యారు. అయితే వీరికి రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించారు. సెషన్-1లో 16,929 మందికి గానూ 14,633 మంది, సెషన్-2లో 16,950 మందికి గానూ 14,830 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో మంది అర్హత సాధించారు. ఈ ఏడాది నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఎడ్‌సెట్ పరీక్షల బాధ్యత చేపట్టిన సంగతి తెలిసిందే. ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్ష ద్వారా రెండేళ్ల బీఎడ్ (బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్) కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. రాష్ట్రంలోని బీఈడీ కళాశాలల్లో మొత్తం 14285 బీఈడీ సీట్లు అందుబాటులో ఉన్నాయి.