Temperatures Dropped Drastically in Telangana : రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఉన్నట్లుండి ఒక్కసారిగా పడిపోయాయి. చాలా చోట్ల సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదివారం రాత్రి నుంచి ఉన్నట్లుండి మారిపోయిన వాతావరణం తెల్లవారుజామున పొగ మంచు కప్పేసింది. హైదారాబాద్‌లో అత్యల్పంగా మౌలాలి, హెచ్‌సీయూ ప్రాంతాల్లో 7.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాజేంద్రనగర్ 8.2, బీహెచ్‌ఈఎల్‌లో 7.4 డిగ్రీలు, శివరాంపల్లిలో 10.3, బాలానగర్ 11.5, పటాన్‌చెరు 11.7, షాపూర్ నగర్ 11.7, బోయిన్‌పల్లి 11.9, గచ్చిబౌలి 9.3, మచ్చబొల్లారంలో 10.2, కత్బుల్లాపూర్ 10.2, వెస్ట్ మారేడ్‌పల్లిలో 9.9, ఆసిఫ్‌నగర్ 12, బేగంపేట 12, మోండా మార్కెట్ 12.4, నేరెడ్‌మెట్ 12.1, లంగర్‌హౌస్ 12.2, చందానగర్ 12.7, మాదాపూర్ 12.8, ముషీరాబాద్ 12.9, కూకట్‌పల్లి 13.1, సఫిల్‌గూడ 13.3, మల్లాపూర్ 13.5, ఆదర్శనగర్ 13.5, చాంద్రాయణగుట్ట 13, షేక్‌పేట్ 12.8, హయత్‌నగర్ 13.3, ఉప్పల్ 13.4 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
అత్యల్పంగా ఆదిలాబాద్‌లో తక్కువ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బేలాలో 6.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. చర్లపల్లి, తిరుమలగిరిలో 13.6 డిగ్రీలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ ప్రాంతంలోని పోచర 6.4, అర్లి 6.6, చాప్రాల్ 6.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిర్మల్ జిల్లాలోని తాండ్రలో 6.3 డిగ్రీలు, సంగారెడ్డి జిల్లాలోని సత్వార్ 6.6, న్యాల్కల్ 6.7, జహీరాబాద్ 6.9, నల్లవెల్లి 6.8 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వికారాబాద్ జిల్లాలోని బంట్వారం 6.7, నగరం (టి) 6.8, మన్నెగూడ 6.8, మర్పల్లి 6.8, రంగారెడ్డి జిల్లాలోని చందనవల్లి 6.7, ఎలిమినేడు 6.7, సిద్దిపేట జిల్లా పోతరరెడ్డిపేట 6.9, కామారెడ్డి జిల్లా మెనూర్‌లో 6.9, జగిత్యాల జిల్లా 7.3, ఆసిఫాబాద్‌లోని కెరమెరిలో 7.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
చలికాలంలో ఆస్థమాతో ఇబ్బందా? ఇది తాగితే హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చట!
ఆస్తమా రోగులు జాగ్రత్తలు పాటించాలి : రాష్ట్రంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు. బయటకు వెళ్లే సమయంలో ముదురు రంగు దుస్తులు ధరించాలని తెలిపారు. చిన్నపిల్లలు, వృద్ధులు వేడి పానియాలు తీసుకోవాలని చెప్పారు. ఆస్తమ రోగులు బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు.
ఆస్తమాతో ఇబ్బందిపడుతున్నారా? - ఆయుర్వేద ఔషధాన్ని ఇలా తీసుకుంటే ఎంతో మేలట!
చలికాలంలో చర్మ సమస్యలా? ఇది పెట్టుకుంటే అన్నీ మాయం! మీరు ట్రై చేయండి!