ETV Bharat / state

అమెరికాలో ఘనంగా తెలుగు టైమ్స్​ బిజినెస్​ ఎక్సలెన్స్​ అవార్డ్స్​ 2024 వేడుకలు - Telugu Times Excellence Awards - TELUGU TIMES EXCELLENCE AWARDS

Telugu Times Business Excellence Awards 2024 : తెలుగు టైమ్స్​ బిజినెస్​ ఎక్సలెన్స్ అవార్డ్​​ కార్యక్రమం అమెరికాలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అవార్డులకు ఎంపికైన వారిని ఘనంగా సత్కరించారు. ఎన్నారై తెలుగు బిజినెస్‌ కమ్యూనిటీ సేవలను గుర్తించి, వారిని అవార్డులతో సత్కరించడం ద్వారా వారి ప్రతిభను ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ అవార్డుల కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.

Telugu Times Business Excellence Awards 2024
Telugu Times Business Excellence Awards 2024 (Telugu Times)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 21, 2024, 2:16 PM IST

Telugu Times Business Excellence Awards 2024 : గత 21 ఏళ్లుగా అమెరికాలోని తెలుగువారికి మీడియాపరంగా సేవలందిస్తున్న ‘తెలుగు టైమ్స్‌’ గత సంవత్సరం నుంచి తెలుగు బిజినెస్‌మెన్‌లను అవార్డులతో సత్కరించే కార్యక్రమాన్ని చేపట్టింది. ఎన్నారై తెలుగు బిజినెస్‌ కమ్యూనిటీ సేవలను గుర్తించి, వారిని అవార్డులతో సత్కరించడం ద్వారా వారి ప్రతిభను ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ అవార్డుల కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలుగు టైమ్స్‌ ఎడిటర్‌, సీఈవో చెన్నూరి వెంకట సుబ్బారావు వెల్లడించారు. మొదటిసారి అవార్డుల వేడుక శాన్‌ఫ్రాన్సిస్కోలోని మిల్‌పిటాస్‌లో అట్టహాసంగా జరిగింది. ఇప్పుడు రెండోసారి తెలుగువారు పెద్ద సంఖ్యలో ఉన్న డల్లాస్‌లో నిర్వహించారు.

Telugu Times Business Excellence Awards 2024
అమెరికాలో ఘనంగా తెలుగు టైమ్స్​ బిజినెస్​ ఎక్సలెన్స్​ అవార్డ్స్​ 2024 వేడుకలు (Telugu Times)

పెద్ద సంఖ్యలో హాజరైన తెలుగు ఎంట్రప్రెన్యూర్​లు : జూన్‌ 16వ తేదీన జరిగిన ఈ వేడుకలకు అత్యధికంగా తెలుగు ఎంట్రప్రిన్యూర్‌లు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని అమెరికా, ఇండియా జాతీయ గీతాలాపనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలుగు టైమ్స్‌ ఎడిటర్‌, సీఈవో చెన్నూరి వెంకట సుబ్బారావు తెలుగు టైమ్స్‌ పత్రికను ప్రారంభించడం వెనుక ఉన్న నేపథ్యాన్ని వివరించారు. గత 21 ఏళ్లు తెలుగు టైమ్స్‌ ఏ విధంగా కమ్యూనిటీకి చేరువైందో తెలియజేశారు. తెలుగు టైమ్స్‌ పత్రిక, పోర్టల్‌, యాప్‌, యూట్యూబ్​ నేడు అమెరికాలోని తెలుగువారిని, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు చేరువైందని వివరించారు.

TANA Ex president On Telugu Times : ఈ అవార్డు వేడుకల్లో తానా మాజీ అధ్యక్షుడు ప్రసాద్‌ తోటకూర మాట్లాడుతూ, తెలుగు టైమ్స్‌తో, చెన్నూరి వెంకట సుబ్బారావుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం వేడుకలకు హాజరైన ప్లానో మేయర్‌ జాన్‌ బి.మున్స్‌ ఇర్వింగ్‌, ఫ్రిస్కో సిటీ నుంచి వచ్చిన అధికారులను ఆహ్వానించి వారిని పరిచయం చేశారు. వేడుకలకు ముఖ్య అతిథులుగా వచ్చిన భారత కాన్సుల్‌ జనరల్‌, డి.సి.మంజునాథ్‌ను నీల్‌ గొనుగొంట్ల వేదికపైకి ఆహ్వానించారు. వ్యాపార రంగంలో తెలుగువాళ్లు చేస్తున్న కృషిని భారత కాన్సుల్‌ జనరల్‌ డి.సి. మంజునాథ్‌ ప్రశంసించారు. విప్రోలో ఎంటర్‌ప్రైజ్‌ ఫ్యూచరింగ్‌కి ప్రెసిడెంట్‌గా ఉన్న ఎగ్జిక్యూటివ్‌ బోర్డు మెంబర్ నాగేంద్ర బండారు కీ నోట్‌ స్పీకర్‌గా హాజరై మాట్లాడారు. గ్రోత్‌ ఈక్విటీ హెడ్‌ రాజా దొడ్డాల, గౌరవ అతిథిగా హాజరయ్యారు.

Speakers' Speech On Various Topics : ఈ సందర్భంగా పలు అంశాలపై వక్తల ప్రసంగించారు. ఈ చర్చాకార్యక్రమానికి మోడరేటర్‌గా ఇంటెల్‌ సాఫ్ట్‌ టెక్నాలజీస్‌ సిఇఓ సతీష్‌ మండువ వ్యవహరించారు. యుఎస్‌ ఇండియా ఛాంబర్‌ఆఫ్‌ కామర్స్‌ (డిఎఫ్‌డబ్ల్యు)కు చెందిన నీలిమ గొనుగుంట్ల, నాట్స్‌ మాజీ ప్రెసిడెంట్‌ బాపయ్య నూతి, నాటా మాజీ ప్రెసిడెంట్‌ శ్రీధర్‌ రెడ్డి కొర్సపాటి తదితరులు పాల్గొన్నారు. నాగేంద్ర బండారు స్పాన్సర్లకు, పార్టనర్‌లకు జ్ఞాపికలను అందజేశారు. సురేష్‌ మండువ, సతీష్‌ బండారు (టాంటెక్స్‌), శ్రీధర్‌ బెండపూడి (ఐటీ బ్లూబర్డ్‌), శేషు కల్రా (సాఫ్ట్‌ కీస్‌ ఇంక్‌), వెంకటేశ్వర చిన్ని (పెలికాన్‌ వ్యాలీ), కృష్ణ కోరాడ (అప్లాజ్‌) తదితరులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులయ్యారు. తెలుగు టైమ్స్‌ డైరెక్టర్‌ సివిబి కృష్ణ వోట్‌ ఆఫ్‌ థ్యాంక్స్‌ను చెప్పారు. శ్రావ్య వేములపాటి చెన్నూరి తన యాంకరింగ్​ అందరినీ ఆకట్టుకున్నారు.

అవార్డు గ్రహీతల వివరాలివే

  • ఐటీ సర్వీసెస్‌ విభాగం - శ్రీకాంత్‌ గడ్డం, ప్రెసిడెంట్‌, ఇఆర్‌పిఎ (కొలంబస్‌, ఒహాయో)
  • హాస్పిటల్స్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ విభాగం - డా. యోగి చిమట, డల్లాస్‌ రెనాల్‌ గ్రూపు (డల్లాస్‌)
  • వెంచర్‌ క్యాపిటల్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ - దయాకర్‌ పుష్కర్‌, సిఇఓ-డల్లాస్‌ వెంచర్‌ క్యాపిటల్‌ (డల్లాస్‌)
  • కమ్యూనిటీ సర్వీసెస్‌ - బాల ఇందుర్తి, ప్రెసిడెంట్‌, శంకర నేత్రాలయ (యుఎస్‌ఎ)
  • సినిమా అండ్‌ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ విభాగం - అనిల్‌ సుంకర, నిర్మాత, ఎకె ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌, డల్లాస్‌
  • ఐటీ ప్రొడక్ట్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ విభాగం - కిరణ్‌ పాశం, ప్రెసిడెంట్‌-ప్లాష్‌ బిఐ, అట్లాంటా
  • లీగల్‌ సర్వీసెస్‌ విభాగం - గీత దమ్మన, అటార్నీ దమ్మన లా (డల్లాస్‌)
  • రియల్‌ ఎస్టేట్‌ అండ్‌ ల్యాండ్‌ డెవలప్‌మెంట్‌ - విజయ్‌ బొర్రా, డిఎఫ్‌డబ్ల్యు ల్యాండ్‌
  • హోటల్‌-రెస్టారెంట్‌ విభాగం - రమేష్‌ గాదిరాజు, ఎ2బి స్వీట్స్‌ అండ్‌ రెస్టారెంట్స్‌
  • ఐటీ స్టాపింగ్‌ - మహేశ్వర్‌ కాసా, ప్రెసిడెంట్‌, కెకె సాఫ్ట్‌వేర్‌ అసోసియేట్స్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.