Telugu film industry Donation to Help Flood Victims: తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు సినీ ప్రముఖుల విరాళాలు కొనసాగుతన్నాయి. 2 రాష్ట్రాల బాధితులకు తెలుగు ఫిల్మ్‌ఛాంబర్ రూ. 25 లక్షల చొప్పున, నిర్మాతల మండలి రూ. 10 లక్షల చొప్పున, ఫిల్మ్ ఫెడరేషన్ రూ. 5 లక్షల చొప్పున విరాళం ప్రకటించాయి. వరద బాధితుల సహాయార్థం థియేటర్ల వద్ద విరాళాలు, వస్తువుల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయించింది.
వరద ప్రాంతాల్లో ఇబ్బందులపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని కమిటీ నివేదిక మేరకు సహాయ కార్యక్రమాలు చేపడతామని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తెలిపింది. ఇక నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు తమ కుటుంబం తరఫున రెండు రాష్ట్రాలకు రూ. 50 లక్షల చొప్పున, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్‌రాజు రూ. 25 లక్షల చొప్పున విరాళాలు ప్రకటించారు. నటుడు వరుణ్ తేజ్ ఏపీ, తెలంగాణకు రూ. 5 లక్షల చొప్పున విరాళం అదించగా ఏపీ పంచాయతీరాజ్ శాఖకు 5 లక్షలు విరాళం ప్రకటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ NCC తెలుగు రాష్ట్రాలకు కోటి చొప్పున సాయం ప్రకటించింది.
"ఇలాంటి విపత్తు సమయంలో అండగా ఉండేందుకు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎప్పుడూ ముందుంటుంది. ప్రజలకు ఎప్పుడు ఎలాంటి ఆపద వచ్చినా చేయూత అందిస్తుంటుంది. డబ్బులే కాకుండా నిత్యావసరాలు కూడా అందించే ప్రయత్నం చేస్తాం." అని నిర్మాత సురేశ్ బాబు పేర్కొన్నారు.
- ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్
"వరద బాధితులకు ఇప్పటికే చాలా మంది హీరోలు విరాళాలను ప్రకటించారు. మేం ఛాంబర్ తరఫున సాయం చేయాలని అనుకున్నాం. ఇండస్ట్రీలోని ప్రతిఒక్కరూ ముందుకొచ్చి ఫెడరేషన్ నెంబర్‌కు విరాళాలను అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. వచ్చిన విరాళాలను ప్రభుత్వాలకు అందిస్తాం."
- నిర్మాత దిల్ రాజు.
వరద బాధితులను ఆదుకునేందుకు ఇండస్ట్రీ తరఫున ఒక కమిటీని ఏర్పాటు చేశాం. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇబ్బందులు ఏం ఉన్నాయో తెలుసుకుని వాటిని పరిష్కరించేలా ముందుకు వెళ్తాం"
- నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ
"రేపు అన్ని యూనియన్లతో సమావేశం ఏర్పాటు చేస్తాం. ఒక రోజు వేతనం ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నాం"
- ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్
"మేం ఈ స్థాయికి రావడానికి ప్రధాన కారణం ప్రజలే. ఇప్పుడు వాళ్లకు కష్టం వచ్చింది. ఇలాంటి సమయంలో వాళ్లను ఆదుకోవాలి." - దర్శకుడు రాఘవేంద్రరావు.
ఇంకా ఈ సమావేశంలో ప్రసన్న కుమార్, భరత్ భూషణ్, అశోక్ కుమార్, జెమినీ కిరణ్, అమ్మిరాజు, అనిల్, భరత్ చౌదరి పాల్గొన్నారు.
విపత్తు వేళ పరిమళించిన మానవత్వం - సీఎం సహాయనిధికి పెద్దఎత్తున విరాళాలు - Huge Donations to CMRF
పవర్‌స్టార్ గొప్ప మనసు - వరద బాధితులకు రూ.6 కోట్లు విరాళం - Pawan Dontation to Flood Victims