ETV Bharat / state

'మీ అపాయింట్​మెంట్​ కావాలి'- తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రముఖుల లేఖ - FILM CHAMBER MEETING

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 20, 2024, 7:52 PM IST

Minister Kandula Durgesh met Megastar Chiranjeevi: విజయవాడలో ఈ నెల 26న తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించాలని తెలుగు చలన చిత్ర పరిశ్రమ నిర్ణయించింది. ఈ క్రమంలో చాంబర్ అధ్యక్షుడు దిల్ రాజుతో పాటు కార్యదర్శులు చంద్రబాబు, పవన్ అపాయింట్​మెంట్ కోరుతూ లేఖ రాశారు. అలానే పర్యాటక, సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కందుల దుర్గేష్‌ మెగాస్టార్ చిరంజీవిని కలిశారు.

film_chamber_meeting
film_chamber_meeting (ETV Bharat)

Telugu Film Chamber meeting in Vijayawada: ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అఖండ విజయం, ప్రభుత్వ ఏర్పాటుపై తెలుగు చలన చిత్ర పరిశ్రమ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతూ ఈ నెల 26న విజయవాడలో తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. చాంబర్ అధ్యక్షుడు దిల్​రాజుతో పాటు కార్యదర్శులు దామోదరప్రసాద్, శివప్రసాద్ రావు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, సినిమాటోగ్రఫి మంత్రి కందుల దుర్గేశ్, ఐటీ మంత్రి నారా లోకేశ్​ అపాయింట్​మెంట్ కోరుతూ లేఖ రాశారు.

'మీ అపాయింట్​మెంట్​ కావాలి'- తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రముఖుల లేఖ (ETV Bharat)

ఆంధ్రప్రదేశ్​లో చిత్ర పరిశ్రమ అభివృద్ధిపై విజయవాడలో జరిగే కార్యవర్గ సమావేశంలో ముఖ్యమంత్రితో చర్చించనున్నట్లు తెలిపారు. అంతకుముందు హిందూపురం శాసనసభ్యుడిగా మూడోసారి ఘన విజయం సాధించిన నందమూరి బాలకృష్ణను (Nandamuri Balakrishna) కలిసి తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి (Telugu Film Board of Trade), తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తరపున అభినందనలు తెలిపారు.

కూచిపూడిలో గిరిజన బిడ్డల ప్రతిభ- దేశ విదేశాల్లో అద్భుత ప్రదర్శనలు - Kuchipudi in Srikakulam district

Minister Kandula Durgesh met Megastar Chiranjeevi: రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫి మంత్రి కందుల దుర్గేశ్ మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. హైదరాబాద్​లోని విశ్వంభర సినిమా సెట్​లోకి వచ్చిన మంత్రి దుర్గేశ్​కు చిరంజీవితోపాటు చిత్ర బృందం సాదర స్వాగతం పలికింది. పర్యాటక, సినిమాటోగ్రఫి మంత్రిగా దుర్గేష్‌ సంపూర్ణ విజయం సాధించాలని చిరంజీవి ఆకాంక్షించారు.

తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి, ఎదుర్కొంటున్న సవాళ్లను సత్వరం పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటానని చెప్పడం ఆయన సానుకూలతకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. అలాగే పర్యాటకరంగంలో అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్న రాష్ట్రంలోని అన్ని పర్యాటక స్థలాల్ని పూర్తిగా అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నట్లు చిరంజీవి పేర్కొన్నారు. ఈ సందర్భంగా విశ్వంభర సెట్‌లో చిరంజీవితో దిగిన ఫొటోలను పంచుకున్నారు. అందులో చిరంజీవి, దర్శకుడు వశిష్ఠ, సంగీత దర్శకుడు కీరవాణితో పాటు మూవీ యూనిట్‌ సభ్యులు ఉన్నారు.

చిన్న వయస్సులోనే 15స్వర్ణ పతకాలు- జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో బహుముఖ ప్రజ్ఞ - Multi Talented Girl

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.