ETV Bharat / state

'కంబోడియా' బాధితులను కాపాడేదెలా? - నేరస్థుల చెర నుంచి రక్షించే దిశగా అధికారుల చర్యలు! - Police on Cambodia Jobs Scam - POLICE ON CAMBODIA JOBS SCAM

Police on Cambodia Jobs Scam : ఉపాధి వేటలో ఉన్న యువతకు అంతర్జాతీయ సైబర్‌ నేరగాళ్లు గాలం వేస్తూ వారిని తమ అధీనంలోకి తీసుకుంటున్నారు. ఉద్యోగాలపై ఆశతో కంబోడియా వెళ్లి అక్కడి సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుని నరకం చూస్తున్న తెలంగాణ యువత రక్షణపై అధికారులు దృష్టి సారించారు. అందుకు గల అవకాశాలపై అన్వేషణ సాగిస్తున్నారు.

Police Focus on Cambodia Smuggling
Police on Cambodia Jobs Scam (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 17, 2024, 10:22 AM IST

Police Focus on Cambodia Smuggling : ఉపాధి ఆశతో కంబోడియా వెళ్లి అక్కడి సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కుకుని నరకం చూస్తున్న తెలంగాణ యువత రక్షణపై అధికారులు దృష్టి సారించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 24 మందిని ఆ రాష్ట్ర పోలీసులు సైబర్‌ నేరస్థుల నుంచి విడిపించి వెనక్కి రప్పించింది తెలిసిందే. అదే విదంగా తెలంగాణకు చెందిన యువకులకు కూడా విముక్తి కల్పించాలని పోలీస్ అధికారులు నిర్ణయానికి వచ్చారు. అందుకు గల అవకాశాలపై అన్వేషణ సాగిస్తున్నారు.

ఉద్యోగ వేటలో ఉన్న యువతకు అంతర్జాతీయ సైబర్‌ నేరగాళ్లు గాలం వేస్తూ వారిని తమ అధీనంలోకి తీసుకుంటున్నారు. అనంతరం వారికి నరకం చూపిస్తున్నారు. సైబర్‌ నేరస్థులు సింగపూర్‌తో పాటు ఇతర ఆగ్నేయాసియా దేశాల్లో ఉద్యోగాలు ఉన్నాయని నిరుద్యోగ యువతను ఆశపెడుతున్నారు. ఇలా చిక్కిన యువకులను కంబోడియా, మయన్మార్‌ వంటి దేశాలకు తరలిస్తూ వారితో సైబర్‌ నేరాలు చేయిస్తున్నారు. బయటకు వెళ్లేందుకు అవకాశం లేకుండా వారి పాస్‌పోర్టులు, ఇతర ధ్రువీకరణ పత్రాలను లాక్కుంటున్నారు. పారిపోయేందుకు ప్రయత్నిస్తే చిత్రహింసలు పెడుతున్నారు.

కమీషన్ల కోసం కంబోడియాలో ఉద్యోగాలంటూ యువకులకు ఎర - ముఠా గుట్టును రట్టు చేసిన పోలీసులు - Sircilla youth Trapped in Cambodia

Telangana Youth Trapped in Cambodia : ఇరుకు గదుల్లో ఉంచుతూ వారితో ప్రతిరోజూ 15 గంటలకు పైగా సైబర్ నేరాలు చేయిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఉండే అమ్మాయిల ఫొటోలు డౌన్‌లోడ్‌ చేయడం, వాటి ఆధారంగా తప్పుడు ప్రొఫైల్స్‌ సృష్టించడం, అనంతరం వారికి వలపు వల విసరడం, ఇందులో చిక్కుకున్న వారిని రకరకాలుగా వేధిస్తూ ఖాతాలు ఖాళీ చేయించడం తదితర పనులను ఆ యువకులకు అప్పగిస్తున్నారు. కుటుంబ సభ్యులతో ఫోన్ మాట్లాడే అవకాశం కూడా ఇవ్వట్లేదు. ఎదురు తిరిగిన వారిని చీకటి గదుల్లో బంధిస్తున్నారు. కర్రలు, ఇనుప రాడ్లతో కొడుతున్నారు. తిండి పెట్టకుండా కడుపులు మాడ్చుతున్నారు. చుట్టూ ఎత్తైన ప్రహరీలు, పటిష్ఠ భద్రతా వ్యవస్థ వల్ల అసలు తప్పించుకునే అవకాశమే ఉండదని వారి వలలో చిక్కి, తిరిగివచ్చిన బాధితులు చెబుతున్నారు.

నిరసనతో కదలిక : సైబర్‌ నేరస్థుల వలలో చిక్కుకున్న దాదాపు 300 మంది భారతీయులు ఇటీవల కంబోడియాలోని జునైబ్‌ కాంపౌండ్, శిహనౌక్‌విల్లే వంటి ప్రాంతాల్లో నిరసనకు దిగారు. దీంతో అక్కడి యంత్రాంగంలో కదలిక వచ్చింది. అక్కడి భారత ఎంబసీ జోక్యం చేసుకోవడంతో వారందరినీ తిరిగి భారతదేశానికి పంపింది. అందులో ఏపీలోని విశాఖపట్నానికి చెందిన 24 మంది యువకులు ఉన్నారు. వారంతా తిరిగి వైజాగ్‌కు వచ్చారు. ఇది జరిగిన కొన్ని రోజులకే మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలానికి చెందిన ఓ యువకుడు కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి తాను కంబోడియాలో ఉన్నానని, ఇక్కడ తనను వేధిస్తున్నారంటూ ఆవేదన తెలిపాడు.

కానీ దీనిపై ఎక్కడా కేసు నమోదు కాలేదు. తెలంగాణకు చెందిన ఇలాంటి బాధిత యువకులు అనేక మంది కంబోడియాలో ఉన్నారని, బయటపడే అవకాశం లేకపోవడంతో అక్కడే మగ్గిపోతున్నారని అధికారులు భావిస్తున్నారు. బాధితులు, వారి బంధువుల నుంచి ఇప్పటివరకు 8 మంది యువకుల వివరాలు వచ్చాయని, ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి సైబర్‌ నేరస్థుల ఉచ్చు నుంచి తప్పించి తెలంగాణకు రప్పించేందుకు మార్గాన్ని పరిశీలిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే కంబోడియాలో చిక్కుకున్న తెలంగాణ యువతకు విముక్తి లభించే అవకాశముంది.

ఆపరేషన్​ కంబోడియా - రాష్ట్రం నుంచి కంబోడియా చేరిన యువత గురించి సైబర్​ క్రైమ్ పోలీసుల ఆరా - Cambodia Scam in India

కంబోడియా దేశం సైబర్​ నేరగాళ్ల వలలో చిక్కుకున్న భారతీయులు - ఇప్పటివరకు రూ.500 కోట్ల పైమాటే దోపిడీ - Indians was Trapped in Cambodia

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.