Telangana Weather Report Today : రాష్ట్రంలో రాగల ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ రోజు మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
Meteorological Department Issued yellow Alert : ఈ ఐదు రోజుల పాటు పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది. నిన్న తూర్పు విదర్భ దాని పరిసర ప్రాంతాలలో కొనసాగిన ఆవర్తనం ఈ రోజు మధ్యప్రదేశ్ యొక్క నైరుతి ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉన్నట్లు పేర్కొంది. ఈరోజు రాష్ట్రంలో క్రింది స్థాయి గాలులు ప్రధానంగా ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్నట్లు వెల్లడించింది.
రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం : కొద్ది రోజులుగా రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. ఉదయం తీవ్రమైన ఎండలు సాయంత్రం అయ్యే సరికి భారీ మేఘాలు కమ్మి ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాలు పడుతున్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అకాల వర్షాలు రైతులను నట్టేట ముంచుతున్నాయి. కొద్ది రోజుల క్రితం రాష్ట్రంలో అకాల వర్షాలు కురిసాయి. దీంతో హైదరాబాద్ సహా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.
మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో పిడుగుపాటుతో పలువురు మృత్యువాతపడ్డారు. రైతుల కొనుగోలు కేంద్రం వద్ద ఆరబెట్టిన ధాన్యం తడిచిపోయాయి. అకాల వర్షాల వల్ల రైతులకు తీవ్రం నష్టం వాటిల్లుతుంది. దీంతో చేసేదేమిలేక రైతులు లబోదిబోమంటున్నారు. ఇటీవల కురిసిన భారీ ఈదురు గాలులతో కూడిన వర్షాల వల్ల బొప్పాయి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. వడగండ్లతో కూడిన వర్షాల వల్ల పలు ప్రాంతాల్లో మామిడి పంట తీవ్రంగా దెబ్బతింది. ఆరుగాల కష్టపడి పండించిన మామిడి పంట దెబ్బతినడంతో రైతులు లబోదిబోమంటున్నారు.
తెలంగాణ ప్రజలకు అలర్ట్ - నేడు ఏడు జిల్లాలకు భారీ వర్ష సూచన - TELANGANA RAIN ALERT TODAY