ETV Bharat / state

రాష్ట్రంలో భిన్న వాతావరణం - ఓ వైపు ఎండలు మరోవైపు వర్షాలు - రాగల మూడు రోజులు జాగ్రత్త! - Telangana Weather Report Today - TELANGANA WEATHER REPORT TODAY

Telangana Weather Report Today : రాష్ట్రంలో కొన్ని రోజులుగా భిన్న వాతావరణం నెలకొంటుంది. ఓ వైపు ఎండలు మండుతుండగా, మరోవైపు అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే రాగల మూడు రోజులు పాటు కొన్ని జిల్లాలో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అలానే ఇవాళ రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయని పేర్కొంది. ఇదే క్రమంలో గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది.

Weather Forecasting Telangana
Telangana Weather Report Today
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 24, 2024, 3:25 PM IST

Telangana Weather Report Today : రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు దాదాపు 36 నుంచి 43 డిగ్రీలపైనే నమోదవుతున్నాయి. మరో వారం రోజుల పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అందులోనూ తెలంగాణలో కొన్ని రోజులుగా భిన్న వాతావరణం నెలకొంటున్నది.

ఓ వైపు ఎండలు ఠారెత్తిస్తుండగా, మరోవైపు అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. రెండ్రోజుల క్రితం పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురిసి, రైతన్నలకు తీవ్ర నష్టాన్ని సైతం కలిగించాయి. భాగ్యనగరంలోనూ వర్షం దంచికొట్టింది. హైదరాబాద్​ వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, రాష్ట్రంలో రాగల మూడు రోజులు కొన్ని జిల్లాలో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉంది. అలానే ఈరోజు రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయని పేర్కొంది.

Weather Forecasting Telangana : ఇదే క్రమంలో గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. ఉపరితల ఆవర్తనం ఒకటి తెలంగాణ, పరిసర కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరం వద్ద సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో ఏర్పడిందని వెల్లడించింది. ద్రోణి గాలి విచ్ఛిన్నతి ఒకటి తెలంగాణ పరిసర కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరం వద్ద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుంచి దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో కొనసాగుతుందని వాతావరణ కేంద్ర సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో వివరించారు.

ఆ సమయంలో బయటకు రావద్దు : రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్న ఎండల దృష్ట్యా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు ప్రజలెవరూ బయటకు రావొద్దని ఐఎండీ సూచించింది. ఎమెర్జెన్సీ పరిస్థితుల్లో రావాల్సి వస్తే, తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. డీహైడ్రేట్‌ బారిన పడకుండా ఉండేందుకు పండ్ల జ్యూస్​లు, ఓఆర్ఎస్‌ ద్రావణాలను తీసుకోవాలని వైద్యులు తెలుపుతున్నారు. రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు గతంలో 2015, 2016 సంవత్సరాల్లో ఎక్కువగా నమోదయ్యాయి. ఆ రెండు ఏడాదుల్లో ఎండల తీవ్రతకు అనేక మంది మృత్యువాతపడ్డారు. ఇటువంటి పరిస్థితి మళ్లీ పునరావృతం కాకుండా జాగ్రత్తగా ఉండాలని, ప్రభుత్వం​ సైతం ప్రజలను హెచ్చరిస్తోంది.

వేసవిలో జలుబును తగ్గించుకోవడం ఎలా? మీకోసం 5 సింపుల్ టిప్స్! - Summer Cold Remedies

నేటినుంచి వేసవి సెలవులు - పిల్లలు జర భద్రం - తల్లిదండ్రులు ఇవి తప్పక చేయండి! - How to Keep Children Safe in Summer

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.