ETV Bharat / state

తెలంగాణ ప్రజలకు అలర్ట్ - రానున్న 2 రోజుల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు - Telangana Weather Report Today - TELANGANA WEATHER REPORT TODAY

Telangana Weather Report Today : రాష్ట్రంలో ఎండలతో బేజారెత్తిపోతున్న ప్రజలకు హైదరాబాద్​ వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రాగల 2 రోజుల్లో పలు జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. బుధ, గురు వారాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశాలున్నట్లు తెలిపింది.

Telangana Weather Report Today
Telangana Weather Report Today
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 23, 2024, 5:16 PM IST

Telangana Weather Report : ఎండ వేడిమితో సతమతమవుతూ ఉపశమనం కోసం చూస్తున్న నగరవాసులకు మరోసారి చల్లని వార్తను అందించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. రాష్ట్రంలో రాగల రెండు రోజులు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు కొన్ని జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం కూడా ఉందని ఐఎండీ సంచాలకులు విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు.

Indian Meteorological Department Weather Forecast : ఈరోజు మాత్రం ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు, రేపు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయని వివరించింది. బుధ, గురు వారాల్లో కొన్ని జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఉపరితల ఆవర్తనం ఒకటి దక్షిణ అంతర్గత కర్ణాటక పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 1.5 కి. మీ. ఎత్తులో ఏర్పడిందని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

తెలంగాణకు అలర్ట్ - మూడు రోజులు కూల్ హ్యాపీస్! - Telangana Rain Alert

ఈ జాగ్రత్తలు పాటిస్తే మేలు : రాష్ట్రంలో వడగాల్పులు వీచే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బయటకు వెళ్లేటప్పుడు తమతో పాటు గొడుగు, చలువ కళ్లద్దాలు, టోపీలు లాంటివి పెట్టుకోవాలని సూచిస్తున్నారు. ఎండల వేడిమికి శరీరంలోని నీరు వేగంగా ఆవిరైపోతుందని కనుక పలుసార్లు మంచినీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు. మరీ అవసరమైతే తప్ప బయటకు వెళ్లకపోవడమే మంచిదని సూచిస్తున్నారు.

అకాల వర్షాల వల్ల నష్టానికి గురైన రైతులు : ఓ వారం రోజుల క్రితం రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల వల్ల రైతులకు తీవ్రనష్టం వాటిల్లింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం బస్తాలు తడిసిముద్దయ్యాయి. దుబ్బాక నియోజకవర్గంలోని కొందరు రైతులు మార్కెట్​లో విక్రయించడానికి తెచ్చిన ధాన్యం తడిచిపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం కారణంగా జహీరాబాద్ పట్టణంలో కొన్ని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం - రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు - Rain in Hyderabadతెలంగాణపై అలకబూనిన వర్షం - 305 రోజుల్లో వాన కురిసింది 66 రోజులే - low rainfall in telangana

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.