ETV Bharat / state

ఐఎండీ గుడ్​న్యూస్ - రాష్ట్రంలో రాగల మూడు రోజులు వర్షాలు - telangana weather updates - TELANGANA WEATHER UPDATES

Telangana Weather Updates : ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. మంగళవారం నుంచి రాగల మూడు రోజులు, పల్లు జిల్లాలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కి. మీ. వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నట్లు తెలిపింది.

RAIN Alert IN TELANGANA
Telangana Weather Updates
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 8, 2024, 4:55 PM IST

Telangana Weather Updates : రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. మండే ఎండలతో జనం అల్లాడిపోతున్నారు. ఈ సమయంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Indian Metrological Department) చల్లటి శుభవార్త చెప్పింది. రాగల మూడురోజులు మంగళవారం నుంచి పలు జిల్లాలో వర్షాలు కురుస్తాయని స్ఫష్టం చేసింది. ఈ మూడు రోజులు రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో పడనున్నట్లు తెలిపింది. గంటకు 30 నుంచి 40 కి. మీ. వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

ఈరోజు రాష్ట్రంలో క్రింది స్థాయి గాలులు దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి వీస్తున్నాయని పేర్కొంది. భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్గొండ, జోగులాంబ గద్వాల, జనగామ, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, మంచిర్యాల జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో వడగాల్పులు(Heat Waves) వీస్తున్నాయని ఐఎండీ హెచ్చరించింది. నిన్న రాష్ట్రంలో అత్యధికంగా సూర్యాపేట జిల్లాలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది.

నిప్పులకుంపటిగా తెలంగాణ - వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు - heat waves in telangana

IMD Issues Alert on Heat waves : ఏప్రిల్‌ ప్రథమార్థంలోనే ఎండల తీవ్రత ఇలా ఉంటే, ఈ మాసం చివరితో పాటు మే నెలలో పరిస్థితి ఏవిధంగా ఉంటుందోనని ప్రజలు జంకుతున్నారు. మే నెలలో ఉష్ణోగ్రతలు 48 నుంచి 49 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో ఎండలకు తోడు వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది. గత రెండు రోజులుగా రాష్ట్రంలో తీవ్రమైన వడగాల్పులు వీచాయి. వృద్ధులు, చిన్న పిల్లలపై ఉష్ణోగ్రతలు, వడగాల్పుల ప్రభావం అధికంగా ఉంది.

ఆ సమయంలో బయటకు రావద్దు : ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు బయటకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసర పరిస్థితుల్లో రావాల్సి వస్తే, తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 2015, 16 సంవత్సరాల్లో కూడా ఎండలు దంచికొట్టాయి. ఆ రెండు సంవత్సరాల్లో ఎండల తీవ్రతకు అనేక మంది మృత్యువాతపడ్డారు. అలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం సైతం ప్రజలను హెచ్చరిస్తోంది.

Summer Precautions for Sunburn : ఎండల నుంచి బయటపడటానికి దాహం వేయకపోయినా వీలైనప్పుడల్లా తగినంత నీరు తాగాలని ఆరోగ్య శాఖ పేర్కొంది. బయటకు వెళ్లేప్పుడు తాగునీటిని వెంట తీసుకెళ్లాలని, ఓరల్‌ రీహైడ్రేషన్‌ సొల్యూషన్‌ -(ORS)ను వినియోగించాలని సూచించింది. నిమ్మరసం, మజ్జిగ, లస్సీ వంటి ఇంట్లో తయారుచేసిన పానీయాలు తీసుకోవాలని తెలిపింది.

తెలంగాణలో భానుడి భగభగ - కూల్ డ్రింక్స్, ఫ్రూట్ జూస్​లతో చలచల్లగా - Demand For Fruit Juices In Summer

ఎండాకాలంలో రోజుకు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే? - how much water to drink in Summer

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.