ETV Bharat / state

రాష్ట్రంలో రాగల రెండ్రోజులపాటు మోస్తరు వర్షాలు - పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ - Telangana Weather Forecast - TELANGANA WEATHER FORECAST

Telangana Weather Forecast : రాష్ట్రంలో రేపు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా కొన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు సైతం జారీ చేసింది. అదేవిధంగా నైరుతి రుతుపవనాల రాకతో, జూన్ 2న పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. మరో వైపు రాష్ర్ట వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

Moderate Rains for Two days in Telangana
Rainfall Alert in Telangana (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 31, 2024, 8:57 PM IST

Telangana Climate Update For Next 2 Days : ఇటీవల కాలంలో నగరంలోని పగటిపూట అత్యధిక ఉష్ణోగ్రతలతో ఎండలు మండిపడటంతో, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ముఖ్యంగా విపరీతమైన ఉక్కపోత, వడగాలులకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో రాష్ట్ర వాసులకు ఐఎండీ గుడ్​న్యూస్​ చెప్పింది.

Yellow Alerts Issue : రాష్ట్రంలో రేపు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నల్గొండ, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, మహబూబ్​నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉండటంతో ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.

జూన్ 2న పలు జిల్లాల్లో భారీ వర్షాలు : జూన్ 2వ తేదీన రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్​నగర్​, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. మరో వైపు రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి.

అన్ని జిల్లాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవ్వగా, ప్రధానంగా 16 జిల్లాల్లో మాత్రం 45కు పైగా ఉష్ణోగ్రతలు రావడం గమనార్హం. వాటిని ఒకసారి పరిశీలిస్తే పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌ 47.1, మంచిర్యాల జిల్లా బీమారం 47.1, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గరిమెల్లపాడు 46.9, నల్గొండ జిల్లా కేతపల్లి 46.8, ఖమ్మం జిల్లా ఖానాపూర్‌ 46.8, సూర్యపేట జిల్లా మునగాల 46.4, జగిత్యాల జిల్లా నేరెళ్ల 46.4గా రికార్డయింది.

Today Weather Report : యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ 46.3, ములుగు జిల్లా వెంకటాపురం 46.2, కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట 46, నిర్మల్‌ జిల్లా బుట్టాపూర్‌ 46, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మొగుల్లపల్లి 45.9, కొమురం ఆసిఫాబాద్‌ జిల్లా కుంచవెల్లి 45.9, ఆదిలాబాద్‌ జిల్లా ఆర్లి 45.7, వరంగల్‌ జిల్లా గొర్రెకుంట 45.1, సిద్ధిపేట జిల్లా కట్కూరు 45.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఒక వైపు అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాల్పుల తీవ్రత, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి చెందారు.

వాతావరణ మార్పులతో బ్రెయిన్​పై తీవ్ర ప్రభావం- ఉష్ణోగ్రతలతో వారికి చాలా డేంజర్! - Climate Change Impact On brain

అత్యంత వేడి సంవత్సరంగా 2024 - చరిత్రలోనే టాప్​ 5లో ఒకటి - 2024 IS THE HOTTEST YEAR

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.