Hyderabad - Bogatha Waterfalls Tour Package: ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలు సహా ఇతర ప్రాంతాలను చూసేందుకు తెలంగాణ టూరిజం అనేక రకాల టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రకృతి పర్యాటకానికి పేరొందిన పలు ప్రాంతాలకు ఇప్పటికే ప్యాకేజీలను ఆపరేట్ చేస్తుండగా.. తాజాగా ములుగు జిల్లాలో ఉన్న బొగత జలపాతం చూసేందుకు, నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్‌ను చూసేందుకు వేర్వేరుగా ఒక్కరోజు ప్యాకేజీలను తీసుకొచ్చింది. మరి, ఈ టూర్లు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? ధర ఎంత? వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..
బొగత వాటర్‌ఫాల్స్: ములుగు జిల్లాలో ఉన్న బొగత జలపాతం చూసేందుకు తెలంగాణ టూరిజం Bogatha Waterfalls- Telangana Toursim పేరుతో ప్యాకేజీని తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. ఒక్క రోజులోనే ఈ ట్రిప్ ముగుస్తుంది. ప్రతి శనివారం, ఆదివారం ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది.
ప్రయాణ వివరాలు:
- ఉదయం 6 గంటలకు హైదరాబాద్ నుంచి నాన్ ఏసీ బస్సులో జర్నీ ప్రారంభం అవుతుంది.
- బొగత వాటర్‌ఫాల్స్ చేరుకొని అక్కడ ఫుల్‌గా ఎంజాయ్ చేయవచ్చు.
- రాత్రి 11.30 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు చేరుకోవడంతో ట్రిప్ ముగుస్తుంది.
- టికెట్ ధరలు పెద్దలకు రూ. 1600, చిన్నారులు రూ. 1280గా నిర్ణయించారు.
- ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, బుకింగ్ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
నాగార్జున సాగర్: నాగార్జున సాగర్‌ను చూసేందుకు వీలుగా Nagarjuna Sagar Tour పేరుతో తెలంగాణ టూరిజం ప్యాకేజీ ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఇది కూడా ఒక్క రోజులోనే టూర్ ముగుస్తుంది. ప్రతి శనివారం, ఆదివారం ఈ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు.
ప్రయాణ వివరాలు:
- ప్రతి శనివారం, ఆదివారం ఉదయం 7.30 గంటలకు హైదరాబాద్ పర్యాటక భవన్ నుంచి, 8 గంటలకు బషీర్‌బాగ్ చేరుకుని అక్కడి నుంచి సాగర్‌కు జర్నీ స్టార్ట్ అవుతుంది. ఉదయం 11:30 గంటలకి నాగార్జున సాగర్‌కు చేరుకుంటారు.
- ఉదయం 11:40 గంటలకు అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసిన బుద్ధవనం ప్రాజెక్ట్‌ను సందర్శిస్తారు. . తర్వాత లంచ్ బ్రేక్ ఉంటుంది.
- ఆ తర్వాత నాగార్జునకొండకు లాంచీలో ప్రయాణం ఉంటుంది. అక్కడ నాగార్జున సాగర్ మ్యూజియం, నాగార్జునకొండ సందర్శిస్తారు.
- సాయంత్రం 4 గంటలకు నాగార్జున సాగర్ డ్యామ్‌ను సందర్శిస్తారు.
- 5 గంటలకు నాగార్జున సాగర్ నుంచి తిరుగు ప్రయాణం మొదలవుతుంది. రాత్రి 9 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
- ఈ ప్యాకేజీ ధరలు చూస్తే పెద్దలకు రూ. 800, పిల్లలకు 640గా నిర్ణయించారు.
- ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, బుకింగ్ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.