Telangana Tourism Latest Tour Package : వీకెండ్ వచ్చిందంటే చాలు.. చాలా మంది పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు పర్యటక ప్రాంతాలకు టూర్ ప్లాన్ చేస్తుంటారు. అలాంటి వారికోసం.. తెలంగాణ టూరిజం(Telangana Tourism) ఒక సరికొత్త ప్యాకేజీని ప్రకటించింది. అది కూడా చాలా తక్కువ ధరలో హైదరాబాద్ నుంచి ఈ టూర్‌ను ఆపరేట్ చేస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే యాదాద్రితో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రముఖ పర్యటక ప్రాంతాలను చూసిరావొచ్చు. ఇంతకీ.. ఆ ప్యాకేజీ ఏంటి? ఒక్కొక్కరికి టికెట్ ధర ఎంత? అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
తెలంగాణ టూరిజం.. "HYDERABAD-WARANGAL-KAKATIYA-RAMAPPA HERITAGE TOUR" పేరుతో ఈ టూర్‌ను ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్లో ప్రయాణం మొత్తం ఏసీ మినీ కోచ్ బస్సులో ఉంటుంది. రెండు రోజుల పాటు సాగే ఈ టూర్ ప్యాకేజీ ప్రతి శనివారం అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. మరి.. ఈ వీకెండ్ టూర్ ప్యాకేజీ ప్రయాణం, ధర వివరాలు చూస్తే..
మొదటి రోజు :
- ఫస్ట్ డే (శనివారం) మార్నింగ్ 7 గంటలకు హైదరాబాద్ నుంచి ఏసీ మినీ కోచ్ బస్సు స్టార్ట్ అవుతుంది.
- ఉదయం 8:30 గంటలకు భువనగిరి ఫోర్ట్ చేరుకుంటారు. అక్కడ సందర్శన అనంతరం యాదగిరిగుట్టకు బయల్దేరుతారు.
- మార్నింగ్ 9:00 గంటలకు యాదగిరిగుట్టకు చేరుకుంటారు. అనంతరం అక్కడ హరిత హోటల్లో బ్రేక్‌ఫాస్ట్ ఉంటుంది.
- టిఫిన్ అనంతరం 9:45 గంటలకు యాదాద్రి దర్శనం ఉంటుంది. ఆ తర్వాత 10:30 గంటలకు అక్కడి నుంచి బయలుదేరుతారు.
- అనంతరం 11:00 నుంచి 11:30 AM వరకు జైన దేవాలయం సందర్శన ఉంటుంది.
- ఆ తర్వాత మధ్యాహ్నం 12:00 గంటలకు హస్తకళలకు ప్రసిద్ధి చెందిన పెంబర్తిలో చాలా సేపు ఆగుతారు. అంటే.. ఆ సమయంలో షాపింగ్ చేసుకోవచ్చు.
- ఆపై 1:30 గంటలకు హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్‌కు చేరుకుంటారు. అక్కడ 1:30 PM నుంచి 4:00 PM వరకు చెక్-ఇన్, భోజన విరామం, విశ్రాంతి ఉంటుంది.
- ఆ తర్వాత 4:00 PM నుంచి 8:30 PM వరకు.. వెయ్యి స్తంభాల గుడి, భద్రకాళి ఆలయాన్ని సందర్శిస్తారు. అలాగే.. వరంగల్ ఫోర్ట్ సౌండ్ & లైట్ షో ప్రదర్శనను వీక్షిస్తారు.
- అనంతరం రాత్రి 9:00 గంటలకు హోటల్‌కి తిరిగి వస్తారు. నైట్ డిన్నర్, బస అక్కడే ఉంటుంది.
రెండో రోజు :
- సెకండ్ డే(ఆదివారం) మార్నింగ్ టిఫిన్ చేసి 8 గంటలకు రామప్ప టెంపుల్‌కు బయల్దేరుతారు.
- 10:00 AM నుంచి 1:00 PM మధ్యలో రామప్ప ఆలయ సందర్శన, బోటింగ్, భోజనం సదుపాయం ఉంటుంది. అనంతరం లక్నవరం వెళ్తారు.
- మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య బోటింగ్ సహా లక్నవరం సందర్శన ఉంటుంది. ఆ తర్వాత అక్కడ నుంచి రిటర్న్ అవుతారు.
- అనంతరం సాయంత్రం 5:00 గంటలకు హన్మకొండలోని హరిత హోటల్‌కు చేరుకుంటారు. అక్కడ టీ, స్నాక్స్ బ్రేక్ ఉంటుంది.
- ఆ తర్వాత 5:30 గంటలకు వరంగల్ నుంచి బయల్దేరుతారు. రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవటంతో మీ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
టూర్ ప్యాకేజీ ధరల విషయానికొస్తే.. పెద్దలకు.. 3,449రూపాయలుగా నిర్ణయించారు. పిల్లలకు 2,759 రూపాయలుగా ఉంది. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ సెప్టెంబర్ 14న శనివారం అందుబాటులో ఉంది. ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
ఇవీ చదవండి :
తెలంగాణ టూరిజం వన్డే ప్యాకేజీ - కేవలం రూ.1500 టికెట్‌తో జోగులాంబ, అంజన్న దర్శనం, ఇంకా మరెన్నో!
శ్రీశైలం మల్లన్న దర్శనంతో పాటు రోప్ వే, బోట్ జర్నీ! - తెలంగాణ టూరిజం సూపర్ ప్యాకేజీలు!