ETV Bharat / state

అంధులు ఈ కళ్లద్దాలు పెట్టుకుంటే చాలు - ఎవరి సాయం లేకుండానే నడిచేయొచ్చు..! - AI POWERED SMART GLASSES

అంధుల కోసం ఏఐ సాంకేతికతతో అభివృద్ధి - పెట్టుకుంటే చాలు చేతి కర్ర ఊతం, ఇతరుల సాయం లేకుండా వారి పనులు - కిమ్స్‌ ఫౌండేషన్, పరిశోధన కేంద్రం ద్వారా తయారీ

AI Powered Smart Glasses Bring Light to Visually Impaired
AI Powered Smart Glasses Bring Light to Visually Impaired (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 22, 2024, 10:50 AM IST

AI Powered Smart Glasses Bring Light to Visually Impaired : సాధారణంగా చేతి కర్ర సాయం లేనిదే అంధులు గడప దాటలేరు. ఇంట్లో తిరగాలన్నా చేతి కర్రే ముఖ్యం. అయితే ఇదంతా ఒకప్పుడు. సాంకేతికత అభివృద్ధి చెందాక అంధుల కోసం వివిధ రకాల టూల్స్‌ వాడుకలోకి వస్తున్నాయి. స్మార్ట్‌ ఫోన్లలో ప్రత్యేక యాప్‌లతో చదువుతున్నారు. రాస్తున్నారు. బయటకు ఎవరి సహాయం లేకుండా వెళ్లగలుగుతున్నారు. తాజాగా ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత కళ్లద్దాలు అందుబాటులోకి వచ్చాయి. అంధులైన వారు వీటిని పెట్టుకుంటే చాలు చేతి కర్ర ఊతం, ఇతరుల సాయం లేకుండా వారి పనులు చేసుకోగలరు.

ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు ఏఐ కళ్లద్దాలు దారి చూపిస్తాయి. టెక్స్ట్‌ టు స్పీచ్‌ సాయంతో పుస్తకంలోని అక్షరాలను ఈ అద్దాలే చదివి వినిపించే వెసులుబాటు ఉంది. కిమ్స్‌ ఫౌండేషన్, రిసెర్చ్‌ సెంటర్‌, డీఆర్‌డీవో మాజీ శాస్త్రవేత్త డాక్టర్‌ వి.భుజంగరావు ఆధ్వర్యంలో ఈ ఏఐ కళ్లద్దాలను రూపొందించారు. తాజాగా గురువారం తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, కిమ్స్‌ ఆస్పత్రి సీఎండీ డాక్టర్‌ బొల్లినేని భాస్కరరావు, ఎల్వీప్రసాద్‌ కంటి ఆసుపత్రి వ్యవస్థాపక ఛైర్మన్, ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్‌ జీఎన్‌రావు చేతుల ఏఐ కళ్లాద్దాలను ఆవిష్కరించారు.

AI Powered Smart Glasses Bring Light to Visually Impaired
ఏఐ ఆధారిత స్మార్ట్​ కళ్లద్దాల పంపిణీ (ETV Bharat)

హైదరాబాద్​లో 'జపాన్​'ను మరిపించే ఇళ్లు! - మీ ఇంటినీ ఇలా 'స్మార్ట్'గా మార్చేయండి

మరింత సాంకేతికతో తీర్చిదిద్దుతాం : తొలి విడతలో 100 మంది అంధ విద్యార్థులకు పంపిణీ చేశారు. ప్రయోగాత్మక పరిశీలన కింద వినియోగించిన తర్వాత మరింత సాంకేతికతతో వీటిని తీర్చిదిద్దనున్నట్లు డాక్టర్‌ వి.భుజంగరావు ఈటీవీ భారత్‌కు తెలిపారు. ప్రస్తుతం ఒక్కో జత తయారీ కోసం రూ. 10వేల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. తొలుత ఎలాంటి లాభాపేక్ష లేకుండానే ఈ కళ్లద్దాలను అందిస్తున్నట్లు వివరించారు. వీటి బరువు 45 గ్రాములు ఉంటుందని తెలిపారు. సాంకేతికత అభివృద్ధి చేసేకొద్దీ ధర తగ్గడమే కాకుండా బరువు తగ్గేలా తయారు చేస్తామని ఆయన చెప్పారు.

  • కళ్లద్దాల్లో యూఎస్‌బీ, బ్యాటరీ : ఏఐ ఆధారిత స్మార్ట్ కళ్లద్దాల్లో అత్యాధునిక కంప్యూటర్‌ విజన్‌, మెషిన్‌ లెర్నింగ్‌ అల్గరిథమ్స్‌ టెక్నాలజీని ఉపయోగించారు. ఇవి అంధులకు అసాధారణ సేవలు అందిస్తాయి. కళ్లద్దాల్లో యూఎస్‌బీ, బ్యాటరీ ఉంటాయి. వీటిని వాడటం కోసం ప్రత్యేక యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని సెల్‌ఫోన్‌లా ఛార్జింగ్‌ పెట్టాలి.
  • పేర్లు నిక్షిప్తం : ఇందులో ఉన్న చిప్‌ ద్వారా వ్యక్తుల ముఖాలు, ఇంటి చిరునామా, ముఖ్యమైన ప్రదేశాలు ఇందులో సేవ్‌ చేసిపెట్టుకోవచ్చు. 400 మంది వరకు వ్యక్తుల ముఖాలను యూఎస్‌బీ మెమొరిలో పేర్లతో నిక్షిప్తం చేసి పెట్టే వీలుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు ఇలా అందరినీ ఇందులో నిక్షిప్తం చేయడం వల్ల వారు తారసపడిన సందర్భంలో కళ్లద్దారు వారి పేరుతో సహా గుర్తించి వారి గురించి అంధులను అప్రమత్తం చేస్తాయి.
  • కళ్లద్దాల్లోని యాప్‌లో ఉన్న టెక్స్ట్‌ టు స్పీచ్‌ లాంటి రీడింగ్‌ అసిస్టెంట్‌ వల్ల పుస్తకంలోని టెక్స్ట్‌ను చదివి వినిపిస్తాయి. దీంతో కొత్త ప్రాంతాలను వెళ్లినప్పుడు బోర్డులు చదవడం, పుస్తకాలు చదువుకోవడం, ఇతరులతో కమ్యూనికేషన్‌ చేయడానికి సహాయపడుతుంది.
  • ముందే ఇంటితోపాటు పనిచేసే కార్యాలయం, చదువుకునే కళాశాల లాంటి ప్రదేశాలను ఇందులో నిక్షిప్తం చేయడం వల్ల ఆయా ప్రాంతాలకు వెళ్లాలి అనుకుంటే దారి గురించి చెప్తుంది. ఎటునుంచి ఎటు వెళ్లాలో దారి చూపిస్తాయి. వారు నివసించే ఇంటిలో పార్కింగ్ దగ్గర నుంచి తమ దగ్గర నుంచి తన గమ్యస్థానానికి సులువుగా చేరుకోవడానికి ఇవి ఎంతో సాయం చేస్తాయి.
  • నడిచేపటప్పుడు వారి ముందు ఏదైనా అడ్డంగా ఉంటే అప్రమత్తం చేయడమే కాకుండా సరైన మార్గాన్ని గుర్తించి ముందే దారిని చెబుతాయి.

అవసరాల్లో అక్కరకొస్తాయ్, ఆపదల్లో ఆదుకుంటాయ్ - డ్రోన్లతో సర్వం సాధ్యం

హైదరాబాద్​లోనే ఉంటున్నారా?- నేటి నుంచి టెక్నాలజీ మేళా- సెలబ్రిటీలు కూడా వస్తున్నారంట!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.