Telangana TET Notification 2024 : ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. అన్నట్టుగానే ప్రభుత్వం ఏడాదిలోనే రెండో సారి టెట్ నోటిఫికేషన్ ఇవ్వటం విశేషం. గత మే లలో తొలిసారి టెట్ నోటిఫికేషన్ ఇచ్చిన సర్కారు. తాజాగా మరో మారు నోటిఫికేషన్ ఇచ్చింది. వచ్చే ఏడాది జనవరిలో టెట్ నిర్వహించనున్నట్టు ప్రకటించింది. 2025 జనవరి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ పరీక్షను నిర్వహించనున్నారు.
టెట్ రాసేందుకు ఆన్లైన్లో దరఖాస్తులు : అభ్యర్థులు నవంబర్ 5 నుంచి 20వ తేదీ లోపు టెట్ రాసేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ స్ఫష్టం చేశారు. పాఠశాల విద్యా అధికారిక వెబ్ సైట్లో మరింత సమాచారం పొందవచ్చని పేర్కొన్నారు. ఆగస్టులో జాబ్ క్యాలెండర్ విడుదల సందర్భంగా ప్రభుత్వం ఏడాదికి రెండు సార్లు టెట్ నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపిన విషయం తెలిసిందే. ఇప్పటికే మే నెలలో ఒకసారి టెట్ నిర్వహించగా మరో మారు నోటిఫికేషన్ విడుదల చేయటం విశేషం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఆరు సార్లు టెట్ పరీక్షలు నిర్వహించగా జనవరిలో జరిగేది ఏడోసారి కానుంది.
టెట్ రాసేందుకు అర్హత : టెట్ పేపర్-1కు డీఈడీ, పేపర్-2కు బీఈడీ పూర్తి చేసిన వారు అర్హులు. స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందేందుకు టెట్ అర్హత ఉండాలని చెబుతుండటంతో వేల మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు కూడా పరీక్షకు హాజరుకానున్నారు. టెట్ ప్రవేశపెట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు తొమ్మిది సార్లు పరీక్షలు నిర్వహించగా జనవరిలో పదోసారి జరగనుంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గత మే పరీక్షతో కలుపుకొని ఆరుసార్లు పరీక్షలు జరిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే రెండోసారి టెట్‌ను నిర్వహిస్తుండటం విశేషం.
ఏపీ టెట్ ఫలితాలు వచ్చేశాయ్ - మీరు చెక్ చేసుకున్నారా?
టెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ - ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు పరీక్ష - TET Conducted TWICE IN A YEAR