Telangana Tax Revenue : 2023 - 24 ఆర్థిక సంవత్సరంలో జనవరితో పది నెలలు పూర్తయ్యాయి. పది నెలల కాలంలో రాష్ట్రం రెవెన్యూ రాబడుల్లో 63 శాతం లక్ష్యాన్ని అధిగమించింది. జనవరి నెల వరకు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయ, వ్యయాలకు సంబంధించి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్- కాగ్‌కు(CAG) రాష్ట్ర ప్రభుత్వం అందించిన వివరాలు ఈ విషయాలను వెల్లడించాయి.
TS Revenue Report to CAG : ఈ ఏడాది రెవెన్యూ రాబడులు మొత్తం 2లక్షల 16వేల 566 కోట్లు ఉంటాయని అంచనా వేయగా, జనవరి నెలాఖరు వరకు అందులో 63.2 శాతం లక్షా 36వేల 859 కోట్లు సమకూరాయి. పన్ను ఆదాయం అంచనా వేసిన లక్షా 52వేల 499 కోట్లలో 72.42 శాతం మేర లక్షా 10వేల 442 కోట్లు వచ్చింది. ఎక్సైజ్ పన్నులు(TS Excise Taxes) అంచనాలో 90 శాతాన్ని దాటి 17వేల 964 కోట్ల రూపాయలు సమకూరాయి. జీఎస్టీ ద్వారా 37వేల 995 కోట్లు, స్టాంపులు- రిజిస్ట్రేషన్‌ల ద్వారా 11వేల 698 కోట్లు, అమ్మకం పన్ను ద్వారా 24వేల 915 కోట్లు ఖజానాకు వచ్చాయి.
Telangana Revenue Details : కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా 11వేల 290 కోట్లు ఇతర పన్నుల రూపంలో 6వేల 577 కోట్లు సమకూరాయి. 2023- 24 లో పన్నేతర ఆదాయం 22వేల 808 కోట్లు వస్తుందని అంచనా వేయగా, జనవరి నెలాఖరు వరకు అందులో 90.2 శాతం 20,572 కోట్లు ఖజానాకు జమయ్యాయి. కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్లు మాత్రం బడ్జెట్ అంచనాలో చాలా తక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో 41వేల 259 కోట్లు వస్తాయని భారీగా అంచనా వేశారు. ఐతే జనవరి నెలాఖరు వరకు వచ్చిన గ్రాంట్ల మొత్తం కేవలం 5వేల 844 కోట్ల రూపాయలు. బడ్జెట్ అంచనాలో ఇది కేవలం 14.17 శాతం మాత్రంగానే ఉంది.
అప్పులు లక్ష్యాన్ని అధిగమించాయి. 38వేల 234 కోట్ల రుణాలు ప్రతిపాదించగా జనవరి నెల వరకు 40,852 కోట్ల అప్పులు తీసుకున్నారు. రాష్ట్ర ఖజానాకు అన్ని రకాలుగా లక్షా 77వేల 742 కోట్ల రూపాయలు సమకూరాయి. బడ్జెట్ అంచనా అయిన 2లక్షల 59వేల 861 కోట్లలో ఇది 68.4 శాతంగా ఉంది. జనవరి నెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన మొత్తం ఖర్చు లక్షా 72వేల 121 కోట్లుగా ఉంది.
రాష్ట్రానికి పెనుభారంగా మారనున్న కాళేశ్వం ప్రాజెక్ట్ - కాగ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు
బడ్జెట్ అంచనా అయిన 2లక్షల 49వేల 209 కోట్లలో ఇది 69.07 శాతం. చేసిన ఖర్చులో రెవెన్యూ వ్యయం లక్షా 38వేల 129 కోట్లు కాగా మూలధన వ్యయం 33వేల 991 కోట్లు. రెవెన్యూ వ్యయం అంచనాలో 65.25 శాతం ఉండగా, మూలధన వ్యయం 90.58 శాతంగా ఉంది. జనవరి నెలాఖరు వరకు వడ్డీ చెల్లింపుల కోసం ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తం 19వేల 102 కోట్లు. వేతనాలపై 32వేల 650 కోట్ల రూపాయలు వ్యయం చేసింది. పెన్షన్లకు 14వేల 12 కోట్లు, రాయితీల కోసం 7వేల 621 ఖర్చు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి పది నెలల్లో 1269 కోట్ల రెవెన్యూ లోటు 40,852 కోట్ల ఆర్థిక లోటు ఉంది. ప్రాథమికంగా 21వేల 749 కోట్ల లోటు నమోదు చేసింది.
గత ప్రభుత్వ ఆసరా పింఛన్ల పంపిణీలో అక్రమాలు జరిగాయి : కాగ్
ఏంటీ! అంబులెన్సులు, ఆటోలు, బైకుల్లో 'గొర్రెల పంపిణీ' చేశారా? - కాగ్ సంచలన రిపోర్ట్