ETV Bharat / state

తెలంగాణలో ఇంటింటా రాఖీ సంబురాలు - నేతలకు రాఖీ కట్టిన సోదరీమణులు - Rakhi Celebrations Telangana 2024 - RAKHI CELEBRATIONS TELANGANA 2024

Rakhi Celebrations In Telangana 2024 : రక్షాబంధన్ సంప్రదాయం భారతీయ జీవన ఔన్నత్యానికి నిదర్శనమని ప్రజాప్రతినిధులు కొనియాడారు. ప్రజల్లో సహోదరత్వాన్ని మరింతగా పెంచుతుందని కాంక్షించారు. రాఖీ పండుగ అన్నాచెల్లెళ్ల బంధానికి ప్రతీక అని, ఇలాంటి పండుగను అందరూ ప్రేమ, అభిమానాలతో జరుపుకోవాలని కోరారు. రాష్ట్రంలోని మహిళామణులందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

Rakhi Celebrations In Telangana 2024
తెలంగాణలో రాఖీ సంబరాలు - నేతలకు రాఖీ కట్టిన సోదరీమణులు (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 19, 2024, 8:43 PM IST

Telangana Political Leaders Rakhi Celebration 2024 : నువ్వు నాకు రక్ష - నేను నీకు రక్ష - జీవితాంతం ఒకరికొకరం అండ అంటూ సోదరీ సోదరుల మధ్య సహృద భావాన్ని చాటేదే పండుగ రాఖీ. ఈ వేడుకను యావత్‌ దేశమంతా నిష్ఠగా జరుపుకుంది. సోదరులు అండగా ఉంటాలంటూ సోదరీమణులు రాఖీలు కడితే, రక్షగా నిలుస్తానంటూ సోదరులు మాటిస్తారు. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ సహోదరత్వానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. పండుగ వేళ రేవంత్‌ రెడ్డికి మంత్రి సీతక్క, ఎంపీ కావ్య సహా పలువురు కార్పొరేషన్ ఛైర్మన్లు రాఖీ కట్టి మిఠాయి తినిపించారు.

నాయకులకు రాఖీ కట్టిన సోదరీమణులు : జీవితాంతం తమకు తోడుండాలంటూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు సోదరీమణులు రాఖీ కట్టి హారతులిచ్చారు. మహిళల రక్షణకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి ఉత్తమ్‌ వ్యాఖ్యానించారు. అక్కాచెల్లెళ్లకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇంట్లో పలువురు రాఖీకట్టి వేడుకను జరిపారు. రవాణశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సోదరిమణి రాఖీ కట్టగా ఆడబిడ్డకు అభివందనం చేశారు. రాఖీ పండుగను పురస్కరించుకుని పంచాయితీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకు రాఖీ కట్టి మిఠాయి తినిపించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు పలువురు కార్పోరేటర్లు, పారిశుద్ధ్య కార్మికులు రాఖీ కట్టారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కోదండరాంకు మహిళా సోదరీమణులు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు.

తెలంగాణ భవన్‌లో రక్షాబంధన్ వేడుకలు : తెలంగాణ భవన్‌లో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. పలువురు మహిళా ప్రజాప్రతినిధులు కేటీఆర్‌కు రాఖీ కట్టారు. సోదరి కవిత తనకు రాఖీ కట్టలేకపోయినా ఎప్పటికీ అండగా ఉంటానని కేటీఆర్ తెలిపారు. గతంలో సోదరి కవిత రాఖీ కట్టిన ఫోటోలను ఎక్స్‌ వేదికగా పంచుకుని గుర్తుచేసుకున్నారు. సిద్దిపేట శాసనసభ్యుడు హరీశ్‌రావుకు హైదరాబాద్ కోకాపేట్‌లోని ఆయన నివాసంలో పలువురు మహిళలు రాఖీలు కట్టగా వారి అభిమానానికి హరీశ్‌ ధన్యవాదాలు తెలిపారు. మేడ్చల్ శాసనసభ్యుడు మల్లారెడ్డి రాఖీ పౌర్ణమి సందర్బంగా బోయినపల్లి క్యాంపు కార్యాలయంలో సోదర, సోదరీమణులతో రాఖీ పండుగ జరుపుకున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో బ్రహ్మకుమారీలు ఎమ్మెల్యే మాణిక్‌రావుకు రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.

మిలిటరీ ఆసుపత్రిలో రక్షాబంధన్ వేడుకలు : సికింద్రాబాద్‌లో కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్యరెడ్డి తిరుమలగిరిలోని మిలిటరీ ఆసుపత్రిలో రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొన్నారు. దేశ రక్షణ కోసం పాటుపడే సైనికులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగుల నడుమ రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఆదిలాబాద్‌ బీజేపీ ఎంపీ గోడం నగేష్ నివాసానికి వచ్చిన పలువురు మహిళామణులు రాఖీ కట్టి ఆప్యాయతను చాటుకున్నారు.

తమ్ముడికి బస్సు ఆపి మరీ సోదరి రాఖీ : హైదరాబాద్ హిమాయత్‌నగర్ బ్రహ్మ కుమారీస్ పీస్​హౌస్‌లో నిర్వహించిన రక్షాబంధన్ వేడుకలకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేపల్లి నంద హాజరయ్యారు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయా విశ్వవిద్యాలయం వారి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కలెక్టర్‌కి రాఖీ కట్టారు. జగిత్యాల జిల్లా మెట్​పల్లి మార్కండేయ ఆలయంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జంజాల పౌర్ణమి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మహబూబ్​నగర్ బస్టాండ్‌లో మహిళా కండక్టర్లు తోటి ఉద్యోగులకు రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపాకలో కండక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న తన తమ్ముడికి బస్సు ఆపి మరీ తన సోదరి రాఖీ కట్టింది. అక్కతమ్ముడి మధ్య ఉన్న అన్యోన్యతను చూసి బస్సులో ఉన్న ప్రయాణికులు మంత్రముగ్థులయ్యారు.

రాజకీయ రాఖీ సంబురం - నేతలకు రక్ష కట్టిన తోబుట్టువులు - RAKHI CELEBRATIONS IN 2024

'నువ్వు రాఖీ కట్టకపోయినా ఎప్పుడు అండగా ఉంటా' - కేటీఆర్ ఎమోషనల్‌ ట్వీట్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.