Telangana Phone Tapping Case Update : ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆధారాల ధ్వంసంతో ఎస్‌ఐబీలో ఇతర ముఖ్యమైన సమాచారం కూడా మాయమైందని పోలీసు అధికారులు ఇప్పటికే గుర్తించినట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ ద్వారా కొందరు రాజకీయ నేతలు (Politicians), ఇతర వ్యాపారుల వద్ద నుంచి సీజ్ చేసిన నగదు (Money) ఎవరికి అప్పగించారు? ఇదే తరహాలో ఇంకా ఎవరెవరి వద్ద నగదు సీజ్ చేశారు? అనే కోణాల్లో దర్యాప్తు బృందం రాధాకిషన్ రావును ప్రశ్నించినట్టు తెలుస్తోంది.
ఇద్దరు కానిస్టేబుళ్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు : మరోవైపు ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping Case) వ్యవహారంలో దర్యాప్తు బృందం నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లను అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. వారిలో ఒక కానిస్టేబుల్ నడిపించిన తతంగం మొత్తం ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నట్టు సమాచారం. సదరు కానిస్టేబుల్ ట్యాపింగ్ ద్వారా అనేక అక్రమాలకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. అనేక మందిని బెదిరించి, డబ్బులు దండుకున్నట్టు దర్యాప్తు బృందం విచారణలో బయటపడినట్టు తెలుస్తోంది. వీరిద్దరు కానిస్టేబుళ్లను ఇంకా విచారిస్తున్నట్టు సమాచారం. అయితే రాధాకిషన్‌రావు పోలీసు కస్టడీలో చెప్పిన విషయాల ఆధారంగా మరికొంత మందిని దర్యాప్తు బృందం ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపు ఆయన కస్టడీ ముగిసిన తర్వాత వైద్య పరీక్షలు (Medical Tests) నిర్వహించి అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు.
కస్టడీలో ఉన్న రాధాకిషన్ రావుకు హైబీపీ - స్టేషన్లోనే వైద్య పరీక్షలు చేయించిన పోలీసులు -
Police Department On Radhakrishnan Rao custody : రాధాకిషన్ రావు కస్టడీ పొడిగించాలని దర్యాప్తు బృందం కోర్టును (Court) కోరే ఆలోచనలో ఉంది. ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా మరికొంత మంది కీలక వ్యక్తులకు నోటీసులిచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో కీలకంగా ఉన్న ఎస్‌ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు విదేశాల్లో ఉన్నందున ఎలా ముందుకు వెళ్లాలన్న ఆలోచనలో న్యాయ నిపుణులతో పోలీసు అధికారులు చర్చిస్తున్నారు. మరో వైపు ప్రణీత్‌రావు బెయిల్ పిటిషన్ పై రేపు నాంపల్లి కోర్టు విచారించనుంది. దీని పై పోలీసులు కౌంటర్ దాఖలు చేయనున్నారు. మొత్తంగా ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసులు మరింత మందిని ప్రశ్నించి విచారణలో బయటపడిన అంశాల ఆధారంగా అరెస్టు కూడా చేసే అవకాశం ఉంది.
రాధాకిషన్ రావు నేతృత్వంలోనే ఆధారాల ధ్వంసం! - తొలిరోజు విచారణలో వెలుగులోకి -
హార్డ్ డిస్క్‌లు ధ్వంసం చేసి మూసీ నదిలో పడేసి - ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్!