ETV Bharat / state

తెలంగాణ నూతన గవర్నర్‌గా జిష్ణు దేవ్ వర్మ ప్రమాణం - GOVERNOR JISHNU DEV OATH CEREMONY - GOVERNOR JISHNU DEV OATH CEREMONY

Telangana New Governor Jishnu Dev Varma : తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్​గా జిష్ణు దేవ్ వర్మ ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే రాజ్ భవన్​లో​ ప్రమాణం చేయించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాల్గో గవర్నర్‌గా జిష్ణు దేవ్ వర్మ ప్రమాణం చేయగా, ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

Telangana New Governor Jishnu Dev Varma
Telangana New Governor Jishnu Dev Oath Ceremony (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 31, 2024, 5:09 PM IST

Updated : Jul 31, 2024, 8:39 PM IST

Telangana New Governor Jishnu Dev Oath Ceremony : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం నాల్గవ గవర్నర్​గా జిష్ణు దేవ్​ వర్మ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు రాజ్​ భవన్​లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ అలోక్​ అరాధే కొత్త గవర్నతో ప్రమాణం స్వీకారం చేయించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రివర్గం, కాంగ్రెస్‌తో పాటు బీఆర్ఎస్​, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరై గవర్నర్​కు శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకుముందు మధ్యాహ్నం అగర్తలా నుంచి బయలుదేరిన గవర్నర్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంషాబాద్‌ విమానాశ్రయంలో మంత్రులు ఉన్నతాధికారులతో కలిసి ఘనస్వాగతం పలికారు. రాజ్‌భవన్‌లో సందడి వాతావరణం నడుమ ప్రమాణ స్వీకార ఘట్టం పూర్తయింది.

1957 ఆగస్టు 15న జన్మించిన జిష్ణుదేవ్‌ వర్మ, త్రిపుర రెండో డిప్యూటీ సీఎంగా 2018 నుంచి 2023 వరకు పని చేశారు. బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడిగానూ గతంలో సేవలందించారు. ఆయన త్రిపుర రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి. 1990లో భారతీయ జనతా పార్టీలో చేరి ముఖ్యపాత్ర వహించారు. రామజన్మభూమి ఉద్యమంలోనూ ఆయన క్రియాశీల పాత్ర పోషించారు. తెలంగాణ బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి త్రిపుర గవర్నర్‌గా నియమితులుకాగా, ఆ రాష్ట్రానికి చెందిన నాయకుడు తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా రావడం విశేషం.

Governor Jishnu Dev Message For Telangana People : తెలంగాణ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన జిష్ణుదేవ్‌ వర్మ, రాష్ట్ర ప్రజానీకానికి తన సందేశాన్ని అందించారు. తనకు రాష్ట్ర గవర్నర్‌గా అవకాశం కల్పించిన భారత రాష్ట్రపతికి, ప్రధానికి ధన్యవాదాలు తెలియజేశారు. త్రిపుర నుంచి వచ్చిన తాను, గొప్ప సంస్కృతి, సుసంపన్నమైన వారసత్వ సంపద, సారవంతమైన నేలలతో దేశ నడిబొడ్డున ఉన్న తెలంగాణకు సేవ చేయడం గర్వంగా ఉందన్నారు.

తెలంగాణ చైతన్యవంతమైన ప్రాంతమన్న ఆయన, వ్యాపారాలకు సైతం కేంద్రబిందువుగా మారిందన్నారు. రాష్ట్రంలో యువకుడు ముఖ్యమంత్రిగా ఉన్నారని, మంచి మంత్రివర్గం ఉందని, వారితో కలిసి రాష్ట్ర అభ్యున్నతికి పాటు పడుతానని తెలిపారు. సుస్థిర ఆర్థికాభివృద్ధితో పాటు సామాజిక అంశాల్లో తెలంగాణను అగ్రగామిగా ఉంచేందుకు అందరితో కలిసి పనిచేస్తానన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతులను రుణ విముక్తులను చేసింది : యువతకు మంచి విద్య, ఉద్యోగావకాశాలు కల్పించేలా కృషి చేసి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రైతు రుణమాఫీ గురించి ప్రస్తావించిన ఆయన, రాష్ట్ర ప్రభుత్వం రైతులను రుణ విముక్తులను చేసిందన్నారు. సామాజిక న్యాయం చివరి వ్యక్తికి సైతం అందాలన్న గవర్నర్, ఐక్యతతో ఉంటూ సుస్థిరాభివృద్ధి సాధించే దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని తెలంగాణ సమాజానికి తన పిలుపునిచ్చారు. గవర్నర్‌గా రాజ్యాంగ విలువలకు కట్టుబడి, పారదర్శకంగా తన విధులు నిర్వహిస్తానని ఆయన వెల్లడించారు.

తెలంగాణ నూతన గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ - సీపీ రాధాకృష్ణన్‌ మహారాష్ట్రకు - TELANGANA NEW GOVERNOR JISHNU DEV

హైదరాబాద్‌ చేరుకున్న నూతన గవర్నర్ జిష్ణు దేవ్‌ వర్మ - స్వాగతం పలికిన సీఎం రేవంత్​

Last Updated : Jul 31, 2024, 8:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.