ETV Bharat / state

నిరుద్యోగులకు గుడ్​ న్యూస్​ - ఆరోగ్యశాఖలో మరో 371 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - TELANGANA HEALTH DEPT VACANCIES

ఆరోగ్యశాఖలో మరో 371 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - 272 నర్సింగ్ ఆఫీసర్లు, 99 ఫార్మాసిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్ - ఫార్మాసిస్ట్‌ పోస్టులకు నవంబర్ 30న పరీక్ష

Telangana Health Dept Vacancies
Telangana Health Dept Vacancies (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 11, 2024, 7:19 PM IST

Telangana Health Department Jobs : వైద్య ఆరోగ్య శాఖలో 371 పోస్టుల భర్తీకి మెడికల్ రిక్రూట్​మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గత నెలలో విడుదల చేసిన ఫార్మాసిస్ట్, నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్​కు అనుబంధంగా ఈ నోటిఫికేషన్ విడుదల చేసినట్టు పేర్కొంది. గత నెలలో 2050 నర్సింగ్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిన బోర్డ్, తాజాగా మరో 272 పోస్టులను జతచేసింది. దీనితో మొత్తం భర్తీ చేయనున్న నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు 2322 కు చేరాయి.

మరోవైపు 633 ఫార్మాసిస్ట్ పోస్టులకు అదనంగా మరో 99 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. దీనితో మొత్తం పోస్టుల సంఖ్య 732కి చేరింది. ఈ నెల 14 లోపు నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపిన బోర్డ్, నవంబర్ 17 న కంప్యూటర్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నట్టు స్పష్టం చేసింది. ఇక ఫార్మాసిస్ట్ పోస్టులకు సంబంధించి ఈ నెల 21 వరకు దరఖాస్తులు స్వీకరించి నవంబర్ 30 న పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.