Telangana Man Died in Dubai : బతుకుదెరువు కోసం ఉన్న ఊరును, కుటుంబ సభ్యులను విడిచి దేశం కాని దేశం దుబాయ్ వెళ్లి నెల రోజులు కూడా కాకముందే అనుమానాస్పదంగా చనిపోయాడు. సంపాదించి తిరిగి ఇంటికి వస్తాడనుకున్న భార్యా పిల్లలకు అతని మరణ వార్త కన్నీటిని మిగిల్చింది. ఈ విషాదకర సంఘటన మెదక్ జిల్లా తిమ్మక్కపల్లి తండాలో చోటుచేసుకుంది. రాట్ల సూర్య (34) బతుకుదెరువు కోసం గత నెల 6న అబుదాబి వెళ్లగా, మూడు రోజుల క్రితం మరణించినట్లు కుటుంబ సభ్యులకు ముసపాృ పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. దుబాయ్ నుంచి వచ్చే మృతదేహం కోసం ఎదురుచూస్తున్నారు.
తిమ్మక్కపల్లికి చెందిన రాట్ల సూర్యకు రెండు మూడు గుంటల వ్యవసాయ భూమి ఉంది. ఉండేందుకు సరైన ఇల్లు కూడా లేదు. పూరి గుడిసెలో జీవనం సాగిస్తున్నాడు. కామారెడ్డి ఏజెంట్ ఇర్ఫాన్ ద్వారా దుబాయ్ వెళ్లేందుకు రూ.లక్షన్నర వరకు అప్పు చేసి పాస్ పోర్ట్, వీసా తీసుకున్నాడు. అంతా సవ్యంగా జరగడంతో గత నెల 6న ముంబయి వెళ్లి అక్కడి నుంచి దుబాయ్‌కు వెళ్లాడు. ఏజెంట్ ద్వారా ఒప్పందం చేసుకున్న కంపెనీలో కొద్ది రోజులు పని చేశాడు. ఇదిలా ఉండగా మూడు రోజుల క్రితం సూర్య మరణించినట్లు దుబాయ్ పోలీసులు ఏజెంట్‌తో పాటు కుటుంబ సభ్యులకు సమాచారాన్ని ఇచ్చారు. అయితే ఇది ప్రమాదామా? లేక అనారోగ్యంతో మరణించాడా అన్నది ఇంకా స్పష్టం కాలేదు.
అబుదాబి నుంచి సూర్య మృతదేహాన్ని స్వస్థలానికి రప్పించేందుకు కుటుంబ సభ్యులు మెదక్ ఎంపీ రఘునందన్ రావు సాయం కోరారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో మృతిడి కుటుంబ సభ్యులు రఘునందన్‌ను కలిసి వివరాలు తెలిపారు. స్పందించిన రఘునందన్ రావు వెంటనే ఇండియన్ ఎంబసీతో మాట్లాడారు. దుబాయ్‌కు సంబందించిన అడ్వకేట్, తెలుగు అసోసియేషన్ ప్రతినిధులతో సూర్య మృతదేహం గురించి తెలిపారు. వీలైనంత త్వరగా సూర్య మృతదేహాన్ని స్వస్థలానికి రప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు ఎంపీ రఘునందన్ రావు తెలిపారు.
దుబాయ్‌లో ఏపీ మహిళ కష్టాలు - స్వదేశానికి తీసుకురావాలని ఆవేదన - వీడియో వైరల్ - AP Woman in Dubai
దుబాయ్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఐదుగురికి విముక్తి - కోర్టు క్షమాభిక్షతో 18 ఏళ్ల అనంతరం ఇళ్లకు