Telangana Intermediate Results 2024 : తెలంగాణలో ఇంటర్ పరీక్షా ఫలితాల కోసం విద్యార్థులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు సైతం రిజల్ట్స్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మొత్తానికి వారి ఎదురు చూపులకు తెరదించుతూ ఫలితాలు ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తోంది.
Telangana Intermediate Results : తెలంగాణలో ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పబ్లిక్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,521 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే దాదాపు పది లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలను రాశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసి ఎంతో పకడ్బందీగా పరీక్షలను అధికారులు నిర్వహించారు.
మార్చి 10 నుంచి మూల్యాంకన ప్రక్రియను ప్రారంభించారు. మొత్తం 4 విడతల్లో ఈ ప్రక్రియను నిర్వహించిన అధికారులు.. ఏప్రిల్ 10వ తేదీన మూల్యాంకనం పూర్తి చేశారు. మార్కుల నమోదుతోపాటు ఎలాంటి టెక్నికల్ ఇబ్బందులూ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం వల్ల ఎలక్షన్ కమిషన్ నుంచి అనుమతి తీసుకున్న తర్వాత అధికారులు ఫలితాలను వెల్లడించనున్నారు.
భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌పై భూకబ్జా కేసు - Land Case On congress MP Candidate
రెండూ ఒకేసారి ?
అయితే.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. ఒకేసారి ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెంకండ్ ఇయర్ రిజల్ట్స్ ప్రకటించే అవకాశం ఉంది. అన్ని ముందస్తు కార్యక్రమాలు పూర్తి చేసుకొని.. ఈ నెల 22వ తేదీ సోమవారం రోజున పరీక్షా ఫలితాలు రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏదైనా అనుకోని ఇబ్బందులు తలెత్తితే ఏప్రిల్ 23వ తేదీ అంటే మంగళవారం రోజున ఇంటర్ ఫలితాలు రిలీజ్ చేసే అవకాశం ఉందని సమాచారం.
ఇంటర్ రిజల్ట్ అఫిషియల్‌గా ప్రకటించగానే వాటిని అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి తెలుసుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంటర్ ఫస్ట్, సెంకడ్ ఇయర్ రిజల్ట్ కోసం అధికారిక వెబ్ సైట్ https://tsbie.cgg.gov.in లోకి వెళ్లి తెలంగాణ ఇంటర్ రిజల్ట్ చెక్ చేసుకోవచ్చు.
హైదరాబాద్‌లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం - రహదారులన్నీ జలమయం - Hyderabad Rains Today