Telangana Inter Results : ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. దీంతో.. తెలంగాణలో ఇంటర్ పరీక్షా ఫలితాలు ఎప్పుడు విడుదలవుతాయా అని తల్లిదండ్రులు, విద్యార్థులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరి తెలంగాణలో ఇంటర్ రిజల్ట్స్ ఎప్పుడో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మార్చి 10 నుంచి..
తెలంగాణలో ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,521 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసిమరీ.. ఎంతో పకడ్బందీగా పరీక్షలను నిర్వహించారు. మూల్యాంకన ప్రక్రియను మార్చి 10 నుంచి ప్రారంభించారు. మొత్తం 4 విడతల్లో ఈ ప్రక్రియను నిర్వహించిన అధికారులు.. ఏప్రిల్ 10వ తేదీన పూర్తి చేశారు. మార్కుల నమోదుతోపాటు ఎలాంటి సాంకేతికపరమైన ఇబ్బందులూ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో.. ఈసీ నుంచి అనుమతి తీసుకున్న తర్వాత అధికారులు ఫలితాలను వెల్లడించనున్నారు.
రెండూ ఒకేసారి..?
ఒకేసారి ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెంకండ్ ఇయర్ రిజల్ట్స్ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. అన్ని ముందస్తు కార్యక్రమాలు పూర్తి చేసుకొని.. ఈ నెల 20వ తేదీ తర్వాత పరీక్షా ఫలితాలు రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. ఈ నెల 21 లేదా 22 తేదీలలో ఇంటర్ ఫలితాలు ప్రకటించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో రిజల్ట్స్ ఇలా..
ఏపీలో ఇంటర్ ఫలితాలు శుక్రవారం రోజున విడుదల చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఒకేసారి ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను అధికారులు వెల్లడించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 67 శాతం, సెకండ్ ఇయర్‌లో 78 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు ఇంటర్మీడియట్ విద్యా కమిషనర్ సౌరబ్‌గౌర్, పరీక్షల కంట్రోలర్ సుబ్బారావు ప్రకటించారు. ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో ఫలితాల్లో బాలికలు 71 శాతం, బాలురు 64 శాతం ఉత్తీర్ణత సాధించారు.
సెకండ్ ఇయర్‌లో ఫలితాల్లో బాలికలు 81 శాతం, బాలురు 75 శాతం ఉత్తీర్ణత పొందారు. ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 84 శాతంతో కృష్ణా జిల్లా ప్రథమస్థానం, 81 శాతంతో గుంటూరు జిల్లా ద్వితీయస్థానం, 79 శాతంతో ఎన్టీఆర్ జిల్లా తృతీయస్థానం, 48 శాతంతో అల్లూరి జిల్లాకు ఆఖరిస్థానం వచ్చింది. సెకండ్ ఇయర్ ఫలితాల్లో 90 శాతంతో కృష్ణా జిల్లా ప్రథమస్థానం, 87 శాతంతో గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు ద్వితీయస్థానం, 84 శాతంతో విశాఖ జిల్లాకు తృతీయస్థానం, 63 శాతంతో చిత్తూరు జిల్లాకు ఆఖరిస్థానం దక్కింది.
ఏపీ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్ - రిజల్ట్స్ చెక్ చేసుకోండిలా - ap Inter Results 2024
ఎగ్జామ్‌కు వెళ్తుండగా ప్రమాదం - ట్రాఫిక్ సీఐ మానవత్వంతో 'తలకు కుట్ల'తో టైమ్‌కు పరీక్షా కేంద్రానికి