ETV Bharat / state

దుర్గం చెరువు ఎఫ్​టీఎల్​ను 6 వారాల్లో నిర్ధారించాలి : హైకోర్టు - Durgam Cheruvu FTL Issue in hc - DURGAM CHERUVU FTL ISSUE IN HC

Arguments on Durgam Pond FTL in High Court : దుర్గం చెరువు ఎఫ్​టీఎల్​పై బాధితులు తెలిపిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని ఆరు వారాల్లో ఎఫ్​టీఎల్​ నిర్ధారించాలని జీహెచ్​ఎంసీకి హైకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఆరు వారాల్లోపు కూల్చివేతలు చేపట్టబోమని జీహెచ్​ఎంసీ తెలిపింది. దుర్గం చెరువు ఎఫ్​టీఎల్​పై ఇవాళ హైకోర్టులో వాదనలు జరిగాయి.

Arguments on Durgam Pond FTL in High Court
Arguments on Durgam Pond FTL in High Court (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 23, 2024, 2:56 PM IST

Telangana High Court on Durgam Cheruvu FTL : దుర్గం చెరువు ఎఫ్​టీఎల్​పై హైకోర్టులో వాదనలు జరిగాయి. దుర్గం చెరువు ఎఫ్​టీఎల్​ నిర్ధారణ శాస్త్రీయంగా జరగలేదంటూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను సీజే ధర్మాసనం విచారించింది. ఈ క్రమంలో ఎఫ్​టీఎల్​పై అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. బాధితులు చెరువుల పరిరక్షణ కమిటీకి అభ్యంతరాలు తెలపాలని హైకోర్టు తెలిపింది. వారంలోపు బాధితులు అభ్యంతరాలు తెలపాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది.

అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని 6 వారాల్లో ఎఫ్​టీఎల్​ నిర్ధారించాలని హైకోర్టు స్పష్టం చేసింది. 6 వారాల్లోపు కూల్చివేతలు చేపట్టబోమని కోర్టుకు జీహెచ్​ఎంసీ తెలిపింది. రికార్డుల ప్రకారం దుర్గం చెరువు ఎఫ్​టీఎల్​ 65 ఎకరాలే ఉందని పిటిషనర్లు హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. దుర్గం చెరువు ఎఫ్​టీఎల్​ 160 ఎకరాలు ఉందని అధికారులు చెప్పడం సరికాదని పిటిషనర్లు వాదించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.