ETV Bharat / state

మల్లారెడ్డికి బిగ్​షాక్​ - 'యూనివర్సిటీ ఆఫ్​ క్యాంపస్​'పై హైకోర్టు కీలక ఆదేశాలు - TELANGANA HC ON MALLAREDDY UNI - TELANGANA HC ON MALLAREDDY UNI

High Court Tells Action Against Mallareddy University : పాలమ్మినా - పూలమ్మినా, మల్లారెడ్డి యూనివర్సిటీ స్థాపించినా అంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి తరచూ చెప్పుకుంటుంటారు. అయితే ఈ యూనివర్సిటీయే ఇప్పుడు ఆయనకు సమస్యగా మారింది. రాష్ట్రంలో అధికారం మారిన తర్వాత మల్లారెడ్డి యూనివర్సిటీ అక్రమ నిర్మాణాలు అంటూ హైకోర్టుకు ఎన్నో ఫిర్యాదులు అందాయి. తాజాగా బాలానగర్​లో ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన ఆఫ్​ క్యాంపస్​ కేంద్రంపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది.

High Court Tells Action Against Mallareddy University
High Court Tells Action Against Mallareddy University (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 5, 2024, 12:05 PM IST

Updated : Jul 5, 2024, 12:16 PM IST

Telangana HC On Mallareddy University : ఎలాంటి అనుమతుల్లేకుండా మల్లారెడ్డి యూనివర్సిటీ బాలానగర్​లో ఏర్పాటు చేసిన ఆఫ్ క్యాంపస్ కేంద్రంపై చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు చేసింది. ఎలాంటి అనుమతులు లేకుండా దూలపల్లిలోని మల్లారెడ్డి యూనివర్శిటీ బాలానగర్​లో సెంటర్ ఆఫ్ ఆఫ్ ఎక్సెలెన్స్ ఫర్ కామర్స్ అండ్ డిజైన్ ఆఫ్ క్యాంపస్ ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ నవీన ఎడ్యుకేషనల్ సొసైటీకి చెందిన వారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి విచారణ చేపట్టారు.

పిటిషనర్​ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, 'రాష్ట్ర ప్రభుత్వం యూజీసీల అనుమతులు లేకుండా ఆఫ్​ క్యాంపస్​ కేంద్రాన్ని ఏర్పాటు చేయరాదు. ఈ పిటిషన్​పై ఏప్రిల్​ 25న ఈ కోర్టు జారీ చేసిన నోటీసులను పిటిషనర్​ తరఫు న్యాయవాది అందజేస్తే మల్లారెడ్డి యూనివర్సిటీతో పాటు దానికి చెందిన ఆఫ్​ క్యాంపస్​ కేంద్రం కూడా తిరస్కరించాయి. నోటీసును తిరస్కరించడం అంటే తీసుకున్నట్లుగానే భావించాలి. అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన కేంద్రంలో బీకాం, బీఎస్సీ కోర్సులకు 2024-25 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు చేపడుతున్నారు. వాటిని చేపట్టకుండా తగిన ఆదేశాలు జారీ చేయాలి.' అని కోర్టును కోరారు.

ఈ వాదనలు విన్న న్యాయమూర్తి ఆఫ్​ క్యాంపస్​ కేంద్రం ఏర్పాటుకు యూజీసీ నిబంధనల ప్రకారం ముందస్తు అనుమతులు అవసరమని తెలిపారు. ఇదే విషయాన్ని పిటిషనర్​తో పాటు ఎస్సీటీఈ, ఉస్మానియా యూనివర్సిటీల తరఫు న్యాయవాదులు కూడా ధ్రువీకరించారని చెప్పారు. నోటీసు జారీ చేసినప్పటికీ మల్లారెడ్డి యూనివర్సిటీ తరఫున ఎవరూ హాజరుకాలేదని, అంతేగాకుండా ఆఫ్​ క్యాంపస్​ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి మల్లారెడ్డి యూనివర్సిటీకి ఎలాంటి అనుమతులు లేవని తేల్చిచెప్పారు.

మల్లారెడ్డి ఆఫ్​ క్యాంపస్​పై చర్యలకు ఆదేశం : అందువల్ల యూజీసీ నిబంధనల ప్రకారం మల్లారెడ్డి యూనివర్సిటీ ఆఫ్​​ క్యాంపస్​ కేంద్రంపై తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, యూనివర్సిటీ గ్రాంట్స్​ కమిషన్​, రాష్ట్ర ఉన్నత విద్యామండలికి ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణను ఈనెల 24కు వాయిదా వేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత వరుసగా మల్లారెడ్డికి సంబంధించిన యూనివర్సిటీపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో చెరువుల్లో నిర్మించిన అక్రమాలను అధికారులు తొలగించారు. అలాగే ఆయనకు సంబంధించిన అక్రమాలను ఒక్కొక్కటిగా అధికారులు గుర్తించి నోటీసులు పంపిస్తున్నారు.

మాజీ మంత్రి మల్లారెడ్డికి అధికారుల షాక్​ - చెరువులో ఫుల్​ ట్యాంక్​ లెవల్లో నిర్మించిన గోడ కూల్చివేత - Illegal Constructions demolished

భూ వివాదంలో మల్లారెడ్డి వర్సెస్​ అడ్లూరి లక్ష్మణ్​ - నువ్వానేనా అంటూ సవాల్​? - MLA Adluri Laxman on MLA Mallareddy

Last Updated : Jul 5, 2024, 12:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.