ETV Bharat / state

కోర్టులో తేలేదాకా స్పీకర్‌ నిర్ణయం తీసుకోరా? - పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు ఫైర్ - TG High Court On Party Defection

Telangana High Court : పార్టీ ఫిరాయింపులపై సోమవారం రోజున హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కోర్టులో తేలేదాకా స్పీకర్‌ నిర్ణయం తీసుకోరా అంటూ ప్రశ్నించింది. ఈ కేసులో ఇప్పటికే నెల గడిచిందని, ఒకవేళ ఇంకో మూడు నెలలు వీటిపై నిర్ణయం వెలువరించకపోతే స్పీకర్‌ కూడా చర్యలు చేపట్టరా అంటూ వ్యాఖ్యానించింది.

Telangana High Court
Telangana High Court (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 6, 2024, 6:49 AM IST

TG High Court On Party Defection : పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వాలన్న వ్యాజ్యాలపై సోమవారం కోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసు కోర్టులో తేలేదాకా స్పీకర్‌ నిర్ణయం తీసుకోరా అంటూ హైకోర్టు సోమవారం అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ)ని ప్రశ్నించింది. ఇప్పటికే నెల గడిచిందని వ్యాఖ్యానించింది. ఒకవేళ ఇంకో మూడు నెలలు వీటిపై నిర్ణయం వెలువరించకపోతే స్పీకర్‌ కూడా చర్యలు చేపట్టరా అంటూ ప్రశ్నించింది.

బీఆర్ఎస్ తరఫున ఎన్నికై కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కె.పి.వివేకానంద్, బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్‌రెడ్డి దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లపై జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి సోమవారం మరోసారి విచారించారు.

ఈ సందర్భంగా కోర్టులో పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నంతవరకు స్పీకర్‌ నిర్ణయం తీసుకోరా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. దీని ఏజీ ఎ.సుదర్శన్‌రెడ్డి సమాధానమిస్తూ, ఇవి రాజ్యాంగపరమైన అంశాలని వాటిని కోర్టులు దాటవేయలేవని పేర్కొన్నారు. పిటిషనర్లు కౌశిక్‌రెడ్డి, కెపి. వివేకానంద్‌లు స్పీకర్‌కు ఫిర్యాదులు ఇచ్చిన వెంటనే హైకోర్టులో వ్యాజ్యాలు వేశారని తెలిపారు.

వాటిని పరిశీలించడానికి స్పీకర్‌కు తగిన గడువు కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. పిటిషనర్లు స్పీకర్‌పై తీవ్రమైన ఆరోపణలు చేయడం సరికాదని ఏజీ వాదించారు. రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్‌ నిర్ణయం తీసుకునేదాకా కోర్టులు జోక్యం చేసుకోజాలవని సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పులను ఆయన ప్రస్తావించారు. స్పీకర్‌ నిర్ణయం తీసుకున్న తరువాత వాటిని సమీక్షించవచ్చని వ్యాఖ్యానించారు.

ఫిరాయింపులపై దిల్లీలో నాయవాదులతో కేటీఆర్ మంతనాలు - అనర్హత వేటే లక్ష్యంగా పావులు - KTR On Party Defections

పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపించారు. పిటిషన్లను తీసుకోవడానికే స్పీకర్‌ కార్యాలయం నిరాకరించిందని గుర్తుచేశారు. హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేసిన తరువాత తీసుకుందన్నారు. నెల రోజుల తరువాత కోర్టును ఆశ్రయించినట్లు వెల్లడించారు. ట్రైబ్యునల్‌గా స్పీకర్‌ నిర్దిష్ట గడువులోగా పిటిషన్లను తేల్చాల్సి ఉందని తెలిపారు. వీటిపై మంగళవారం కూడా వాదనలు కొనసాగనున్నాయి.

సుప్రీం కోర్టుకు వెళ్లనున్న బీఆర్ఎస్ ఇక ఇదే అంశంపై బీఆర్ఎస్ నేతలు సుప్రీం కోర్టులో సైతం పోరాడాలని నిర్ణయించారు. సోమవారం బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు దిల్లీలోని నాయకోవిదులను కలిశారు. పార్టీ మారిన నేతలను అనర్హులుగా ప్రకటించే విషయమై చర్చించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించేవరకూ పోరాటం ఆపబోమని తేల్చిచెప్పారు. రాష్ట్రంలో త్వరలోనే ఉపఎన్నికలు రాబోతున్నాయని బోష్యం చెప్పారు. పార్టీ మారిన నేతలకు ప్రజాక్షేత్రంలోనే బుద్ది చెబుతామన్నారు.

సెప్టెంబర్ 5న విచారణకు హాజరుకండి - కేసీఆర్‌కు భూపాలపల్లి కోర్టు నోటీసులు - Bhupalapalli court notices to KCR

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.