HC on Mother Assets Rights Issue : ఆస్తి గొడవలపై హైకోర్టు ఇవాళ కీలక తీర్పునిచ్చింది. తల్లి స్వార్జిత ఆస్తిపై పిల్లలు హక్కులు కోరరాదని, తనకు ఇష్టమైనవారికి కానుకగా ఇచ్చే అధికారం తల్లికి ఉందని హైకోర్టు తేల్చి చెప్పింది. అస్తిపై హక్కులను ఆధారాలతో కోరాలని అంతేగాని పరస్పర విరుద్ధమైన ప్రకటనలతో కోరలేరని స్పష్టం చేసింది. నిజమైన హక్కులున్నప్పుడే దావాలు వేయాలని, ఊహాజనిత అంశాలతో అదృష్టాన్ని పరీక్షించుకునేలా దావాను వేయడం చెల్లదని పేర్కొంది.
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఇంటిలో మూడో వంతు వాటా ఇవ్వకుండా పెద్దకుమారుడి పేరుతో గిఫ్ట్ సెటిల్మెంట్ డీడ్ చేయడాన్ని సమర్థిస్తూ సివిల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ భజరంగ్ లాల్ అగర్వాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ ఎం జి ప్రియదర్శినిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ 1988లో తండ్రి ఇంటిని కొనుగోలు చేసి, తల్లి పేరుతో రిజిస్టర్ చేశారన్నారు.
తండ్రి మరణానంతరం ముగ్గురు కొడుకుల పేరుతో విల్ డీడ్ చేశారన్నారు. అనంతరం విల్లు డీడ్ రద్దు చేసి పెద్ద కొడుకు రాజేంద్ర అగర్వాల్ పేరుతో గిఫ్ట్ సెటిల్మెంట్ డీడ్ చేశారన్నారు. ఉమ్మడి కటుంబ అస్తిగా, ఇంటిలో మూడో వంతు వాటా ఇవ్వాలని కోరాడు. తల్లి సుశీల్అగర్వాల్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఇంటిని సొంతంగా కొనుగోలు చేశారని, ఇందులో కొడుకులకు ఎలాంటి హక్కు లేదని తెలిపారు.
ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం తల్లి సునీల్అగర్వాల్ ఆస్తి నుంచి మూడో వంతు వాటా అడుగుతున్న భజరంగ్ లాల్ అగర్వాల్ భిన్నమైన వాదనలు చేస్తున్నారని పేర్కొంది. విల్లు డీడ్‌లో ముగ్గురికీ వాటాలు ఇచ్చినపుడు తల్లికి హక్కులున్నాయని అంగీకరించి, గిఫ్ట్ డీడ్ చేశాక తల్లికి హక్కులు లేవని భిన్నవాదనను తెరపైకి తెచ్చారంది. ఇది ఉమ్మడి ఆస్తి అని తల్లి కనిపించే యజమానిగా మాత్రమే ఉన్నారని పిటిషనర్ పేర్కొంటున్నపుడు మొదట విల్ డీడ్ చేసినప్పుడే దానిని రద్దు కోరాల్సిందని పేర్కొంది.
ఇప్పుడు దాన్ని రదు చేసిన తరువాత తల్లికి హక్కులు లేవంటూ రద్దు కోరడం చెల్లదని ఉత్తర్వులు జారీ చేసింది. పరస్పర విరుదమైన ప్రకటనలతో అదృష్టాన్ని పరీక్షించుకునేలా దావాను వేశారని పేర్కొంటూ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది, ఆస్తికి యజమానిగా తల్లి గిప్ఠ్ డీడ్ ఇవ్వడాన్ని సమర్థిస్తూ తీర్పు వెలువరించింది.
''మరణ వాంగ్మూలం ఆధారంగా యావజ్జీవ శిక్ష విధించవచ్చు - ఆ తీర్పు సబబే' - TG HC on Life Sentence