HC Issued Notices To MLA Danam Nagender : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు హైకోర్టు(HIGH COURT) నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యే ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన ఎన్నికల పిటిషన్‌పై వివరణ ఇవ్వాలంటూ ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్(Danam Nagender) బీఆర్ఎస్ తరఫున ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఈయనపై పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి విజయారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బి.విజయ్‌సేన్ రెడ్డి విచారణ చేపట్టారు.
'దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలి' - స్పీకర్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు
ఎన్నికల సమయంలో దానం నాగేందర్ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ డబ్బులు పంచిపెట్టారని పిటిషనర్ తరఫు న్యాయవాది సుంకర నరేష్ కోర్టుకు తెలిపారు. డబ్బుల పంపకానికి సంబంధించి పలు పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదు అయ్యాయని కోర్టుకు తెలిపారు. ప్రజాప్రాతినిధ్య చట్టానికి(people Representation Act ) ఇది పూర్తి వ్యతిరేకమన్నారు. దానం నాగేందర్ తన భార్యకు సంబంధించిన ఆస్తి వివరాలను నామినేషన్(Nomination) పత్రాల్లో పేర్కొనలేదన్నారు. వాదనలు విన్న హైకోర్టు వివరణ ఇవ్వాలంటూ దానం నాగేందర్‌కు నోటీసులు జారీ చేస్తూ విచారణను వచ్చే నెల 18వ తేదీకి వాయిదా వేసింది.
గతంలో సభాపతికి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలు
బీఆర్ఎస్లో ఖైతరాబాద్ ఎమ్మెల్యేగా గెలిచి ఇటీవలే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీనిపై గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు(BRS MLAs) కొద్ది రోజుల క్రితమే సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన దానంపై అనర్హత వేటు వేయాలని గులాబీ నేతలు సభాపతికి విజ్ఞప్తి చేశారు.
మరోవైపు కాంగ్రెస్ గూటికి చేరిన దానం నాగేందర్‌ను ఆ పార్టీ సికింద్రాబాద్ లోక్ సభ స్థానం నుంచి బరిలో దింపింది. గురువారం విడుదలైన కాంగ్రెస్ పార్టీ మూడో జాబితాలో దానం నాగేందర్ పేరును ఖరారు చేసింది. సికింద్రాబాద్ స్థానాన్ని ఈసారి ఎలాగైనా కైవసం చేసుకోవాలని భావిస్తున్న హస్తం పెద్దలు అందుకు తగ్గట్లుగా సిటీలో బాగా పరిచయమున్న దానం నాగేందర్‌ను ఎంపిక చేసింది. ఇదే స్థానం నుంచి బీజేపీ తరపున కిషన్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. బీఆర్ఎస్ ఇంకా ఎవరిని ఖరారు చేయలేదు.
వరుసపెట్టి కారు దిగుతున్నారు - వలసలతో గులాబీ పార్టీలో గుబులు
బెంగళూరు పరిస్థితి రాకముందే మేల్కొండి - నీటి సమస్యపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
ఎల్బీనగర్ పీఎస్‌లో మహిళపై పోలీసుల దాడి.. నివేదిక కోరిన హైకోర్టు