ETV Bharat / state

పోలీసులు ఉన్నది ప్రజల కోసం - వారిని భయాందోళనలకు గురి చేయడానికి కాదు : హైకోర్టు - హైకోర్టు పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు

Telangana High Court Comments On Police : ప్రజల పట్ల పోలీసుల తీరు మారాల్సిన అవసరం ఉందని తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది. తనపట్ల అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తిపై ఫిర్యాదు చేసినా కరీంనగర్ రెండో పట్టణ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్​పై విచారణ సందర్భంగా ఈ మేరకు పేర్కొంది.

High Court on Police Action to Woman Register Complaint
Telangana High Court Comments On Police
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 17, 2024, 9:29 AM IST

Telangana High Court Comments On Police : ప్రజల పట్ల పోలీసుల తీరు మారాల్సిన అవసరం ఉందని తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది. పోలీసులు ఉన్నది ప్రజల కోసం వారిని భయాందోళనలకు గురి చేయడానికి కాదని సీజే ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పోలీసుల ప్రవర్తన మార్చుకునేలా, వారి విధులను గుర్తు చేసేలా అవగాహన తరగతులు నిర్వహించాలని డీజీపీకి చెప్పాలని అదనపు ఏజీకి సూచించింది. పోలీస్​స్టేషన్‌కు పౌరులు సరదాగా రారని, న్యాయవాదులు, డాక్టర్లతో పాటు పోలీసుల వద్దకు ఎవరూ వెళ్లాలని కోరుకోరని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించడం ప్రజలకు కష్టంగా మారిందని, ఇకపై కేసు నమోదు చేయలేదంటూ ఎవరూ కోర్టుకు రాకుండా డీజీపీ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. తనపట్ల అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తిపై ఫిర్యాదు చేసినా కరీంనగర్‌ రెండో పట్టణ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ ఓ మహిళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారణ చేపట్టింది.

'కాళేశ్వరం ప్రాజెక్టు' వ్యవహారంపై ప్రభుత్వ నిర్ణయం ఏంటి : హైకోర్టు

High Court on Police Action to Woman Register Complaint : కోర్టు ఆదేశంతో ఎస్‌హెచ్‌వో ఓదెల వెంకటేశ్‌ వ్యక్తిగతంగా హాజరయ్యారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్‌ వాదనలు వినిపిస్తూ 14న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యాన్ని ప్రభుత్వ న్యాయవాది సమర్థించినందుకు వారి తరఫున ఏఏజీ క్షమాపణ కోరారు. దీంతో ఎస్‌హెచ్‌వోను వదిలిపెట్టలేమని, ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంపై వివరణ ఇచ్చుకోవాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది.

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్

'ఉద్యోగం నుంచి తొలగించినందుకు మహిళ ఫిర్యాదు చేయడానికి వచ్చారని చెబుతున్నారు. ఒకవేళ అది తప్పుడు ఫిర్యాదు అయినా తీవ్రమైన ఆరోపణలున్నప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందే’ అని హైకోర్టు తెలిపింది. దర్యాప్తులో అసలు విషయాలు తెలుస్తాయని పేర్కొంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసినందున, పిటిషన్‌పై అభ్యర్థనలను మూసి వేస్తున్నామని, ఎస్‌హెచ్‌వో వివరణ నిమిత్తం విచారణను మార్చి 4వ తేదీకి వాయిదా వేస్తున్నామని తెలిపింది. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడానికి కారణాలేమిటో వివరణ ఇస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.

పీఎస్​లో మహిళ ఫిర్యాదును పట్టించుకోని కరీంనగర్ పోలీసులు - హైకోర్టు సీరియస్

'గవర్నర్‌ కోటా కింద ఎమ్మెల్సీలుగా నియామకానికి మాకు అన్ని అర్హతలూ ఉన్నాయ్!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.